Friday, April 19, 2024
Friday, April 19, 2024

కొత్త వేరియంట్‌ కలవరం…

ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ

కొత్త వేరియంట్‌ ాఒమిక్రాన్‌్ణ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. డెల్టా కంటే ఈ కొత్త వేరియంట్‌ మరింత ప్రమాదకరమైనదని..అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం నిర్వహించారు. దేశంలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి భూషణ్‌, నీతి అయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే దాని పొరుగుదేశాలకూ వ్యాపించింది. కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్‌ సోకుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని..ఇది వేగంగా వ్యాపించి తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధాని భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img