Friday, April 19, 2024
Friday, April 19, 2024

కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నాం

ప్రధాని మోదీ సంచలన ప్రకటన

అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కీలక ప్రకటన చేశారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న వేళ మోదీ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. నేడు జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నానని ప్రధాని అన్నారు. ‘తమ ప్రభుత్వం ఏం చేసినా..అది రైతుల కోసమే..ఏం చేస్తున్నా అది దేశం కోసమే అన్నారు. మూడు సాగు చట్టాలను కూడా రైతుల ప్రయోజనం కోసమే తీసుకోచ్చాం. ముఖ్యంగా సన్నకారు రైతులకు ఈ చట్టాలు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని వర్గాల రైతులకు ఈ చట్టాలపై సర్ధిచెప్పలేకపోయాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని చెప్పారు.. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో రైతు చట్టాల రద్దుపై తీర్మానం చేయనున్నట్లు ఆయన వెల్లడిరచారు. సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు తమ ఆందోళనను విరమించి తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నట్లు చెప్పారు. 2014లో తాను ప్రధాని అయిన తర్వాత రైతులకు ప్రాముఖ్యత కల్పించానని, వారి సంక్షేమం.. అభివృద్ధి కోసం పని చూశామన్నారు. వంద మంది రైతుల్లో.. 80 మంది రైతుల వద్ద రెండు ఎకరాల లోపే భూమి ఉందన్నారు. ఆ భూమే వారికి జీవనాధారంగా మారిందన్నారు. రైతులు తమ కష్టానికి తగ్గ ఫలితం పొందేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామీణ మౌళిక సదుపాయాల మార్కెట్‌ను బలోపేతం చేశామన్నారు. ఎంఎస్‌పీ పెంచామన్నారు. రికార్డు స్థాయిలో ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లను పెంచామన్నారు. తాము చేపట్టిన ప్రొక్యూర్మెంట్‌ విధానం గత ప్రభుత్వ రికార్డులను బ్రేక్‌ చేసిందని ప్రధాని మోదీ తెలిపారు.రైతులకు సరసమైన ధరల్లో విత్తనాలను సరఫరా చేశామని వెల్లడిరచారు. ఫసల్‌ బీమా యోజనను బలోపేతం చేశామన్నారు. ఆ స్కీమ్‌ కిందకు అధిక సంఖ్యలో రైతుల్ని చేర్చామన్నారు. రైతు బాగు కోసం మరింత కఠినంగా పనిచేస్తానని మోదీ అన్నారు. మీ స్వప్నాలను, దేశ స్వప్నాలను నిజం చేసేందుకు పనిచేస్తానని ప్రధాని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img