Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

దేశవ్యాప్తంగా మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచే ఆయా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు చోట్ల బీజేపీ లీడిరగ్‌లో ఉండగా, కాంగ్రెస్‌ 3 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది.కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరభద్రసింగ్‌ మరణంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్‌ తరపున వీరభద్ర సతీమణి ప్రతిభాసింగ్‌ పోటీ చేయగా బీజేపీ నుంచి కార్గిల్‌ వీరుడు బ్రిగేడర్‌ కుషాల్‌ సింగ్‌ బరిలోకి దిగారు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ప్రతిభాసింగ్‌ ఆధిక్యంలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్తి జ్ఞానేశ్వర్‌ పాటిల్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అస్సాంలో అయిదు స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. మూడు సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.మరో రెండు చోట్ల బీజేపీకి మద్దతు ఇచ్చిన యూపీపీఎల్‌ పార్టీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది.మేఘలయాలో మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ యూజెనిసన్‌ లింగ్డో ఆధిక్యంలో ఉన్నారు. బెంగాల్‌లోని నాలుగు స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టగా..నాలుగింట తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. దీంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. డప్పు దరువులకు స్టెప్పులేస్తున్నారు. గోసాబ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి సుబ్రతా మండల్‌ ఆధిక్యంలో ఉన్నారు. ఖర్దప్‌ా నియోజకవర్గంలో శోభన్‌ దేవ్‌ ఛటోపాధ్యాయ(టీఎంసీ), శాంతిపూర్‌లో కిశోర్‌ గోస్వామి(టీఎంసీ) ముందంజలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img