Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కొవిడ్‌ మహమ్మారి ఇప్పుడప్పుడే మానవాళిని వదలదు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సీనియర్‌ అధికారి పూనమ్‌ ఖేత్రపాల్‌
కొవిడ్‌ వైరస్‌ ఇప్పుడప్పుడే మానవాళిని వదలబోదని, దీర్ఘకాలంపాటు అది ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపింపజేస్తూనే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సీనియర్‌ అధికారి పూనమ్‌ ఖేత్రపాల్‌ తెలిపారు. కొంతకాలానికి ఎండెమిక్‌ స్థాయికి దిగివస్తుందా అన్నది టీకాలు, రోగనిరోధకతపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా విభాగానికి ప్రాంతీయ డైరక్టర్‌గా ఉన్న ఆమె తాజాగా పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలిపారు. టీకా తీసుకోని కారణంగానే చాలావరకు కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయని తెలిపారు. టీకాలను బూస్టర్‌ డోసుల కోసం వినియోగించడం వల్ల మొదటి డోసు కోసం ఎదురుచూస్తున్న కోట్లాదిమంది ఇబ్బంది పడతారని అందుకే దాని వినియోగంపై 2021 చివరి వరకు మరటోరియం విధించాలని డబ్య్లూహెచ్‌ఓ పిలిపించిందన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేవరకు ఏ ఒక్కరూ సురక్షితం కాదని మనం గుర్తుంచుకోవాలన్నారు. కొవాగ్జిన్‌ టీకాకు అత్యవసర వినియోగంకు అనుమతులిచ్చే విషయంపై సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img