Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కొవిడ్‌ టీకాలతో దుష్ప్రభావాలు

అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం
కొవిడ్‌ టీకాలతో పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సమాచార హక్కు చట్టం కింద పుణేకు చెందిన వ్యాపారి ప్రఫుల్‌ సర్దా అడిగిన ప్రశ్నకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీసీఎస్‌వో) ఈ మేరకు సమాధానమిచ్చాయి.
ప్రస్తుతం అస్ట్రాజెనెకా-సీరం సంస్థకు చెందిన కొవిషీల్డ్‌, సీరం సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన కొవొవ్యాక్స్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వీ, బయోలాజికల్‌-ఈ అభివృద్ధి చేసిన కార్బీవాక్స్‌, క్యాడిలా సంస్థ తయారుచేసిన జైకోవ్‌ డీ టీకాలకు కేంద్రం అనుమతించింది.
దుష్ప్రభావాలు ఇలా..
కొవిషీల్డ్‌: టీకా వేసిన చోట నొప్పి, దద్దుర్లు, కారణాల్లేకుండానే వాంతులు, పొత్తికడుపులో నొప్పి, తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీనొప్పి, కాళ్ల నొప్పి, పక్షవాతం, మూర్ఛ, కండ్లలో నొప్పి, చూపు మందగించడం, మానసిక స్థితిలో మార్పు
కొవాగ్జిన్‌: టీకా వేసిన చోట నొప్పి, తలనొప్పి, జ్వరం, అలసట, ఒళ్లునొప్పులు, పొత్తికడుపులోనొప్పి, వికారం, వాంతులు, జలుబు, దగ్గు, కళ్లు తిరగడం, వణుకు
కొవొవ్యాక్స్‌: ఇంజెక్షన్‌ చేసిన చోట నొప్పి, దురద, అలసట, తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, ఒళ్లునొప్పులు, శక్తిలేకపోవడం, వెన్నునొప్పి, కళ్లుతిరగడం
స్పుత్నిక్‌ వీ: జ్వరం, కీళ్లనొప్పులు, కండరాల నొప్పి, శక్తిలేకపోవడం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, వికారం, టీకా వేసిన చోట నొప్పి
కార్బీవ్యాక్స్‌: టీకావేసిన చోట నొప్పి, జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్లునొప్పులు, కండరాలనొప్పి, వికారం, దద్దుర్లు, నిద్రమత్తు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img