Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కోకాకోలా కంపెనీని కొనుగోలు చేస్తా…: ఎలాన్‌ మస్క్‌

కొకైన్‌ను కోకా కోలాకు తిరిగి చేరుస్తానని ట్వీట్‌
ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు కోసం టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ చేసిన ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. చివరకు 44 బిలియన్ల డాలర్లతో దాని కొనుగోలుకు ఒప్పదం చేసుకున్నారు.ఆ సంస్థ ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొన్నారు. ఈ క్రమంలో ఇతర కంపెనీలను కూడా కొనుగోలు చేయడంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు ఆయన కోకాకోలా కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. కోకాకోలా అనేక దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈ కంపెనీని కొనుగోలు చేసి ఇల్లీగల్‌ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కోకా కోలాకు తిరిగి చేరుస్తానని కూడా మస్క్‌ తన ట్వీట్‌ లో పేర్కొనడం గమనార్హం. కాగా తన అభిప్రాయాలు, ఆలోచనలు బహిరంగంగా పంచుకునే మస్క్‌ దీనిపై సరదాగా స్పందించి ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. కోకా కోలా కూల్‌ డ్రిరక్‌లో కోకా ఆకులు, కోలా గింజలు ఉండేవి. కోకా ఆకుల నుంచి సైకోయాక్టివ్‌ డ్రగ్‌ కొకైన్‌ వస్తుంది. అప్పట్లో కోకా కోలా కూల్‌ డ్రిరక్‌ అధికంగా కోకా ఆకుల మీదే ఆధారపడేది. ఆ రోజుల్లో కొకైన్‌ను ఔషధంగా పరిగణించినప్పటికీ, చివరకు నిషేధిత జాబితాలో చేర్చారు. అమెరికా కూడా దానిని నిషేధించడంతో కోకా కోలా నుంచి కోకా ఆకులు దూరమై అందుకు బదులుగా డీకోకైనైజ్డ్‌ కోకా ఆకులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మస్క్‌ కోకా కోలాకు తిరిగి కొకైన్‌ ను తీసుకొస్తానంటూ ట్వీట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img