Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కోటా బియ్యం రీసైక్లింగ్‌

కదిరిలో కోట్ల వ్యాపారం

అధికార పార్టీ నేత మిల్లు కేంద్రంగా అక్రమాలు
మామూళ్ల మత్తులో అధికారులు

అనంతపురం : పేదలకు అందాల్సిన కిలో రూపాయి బియ్యం అక్రమార్కులకు సంపాదన వనరుగా మారింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణం కేంద్రంగా కోట్ల రూపాయల బియ్యం అక్రమ తరలింపు వ్యాపారం జరుగుతోంది. అయినా అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలా కనిపించడం లేదు. కదిరి పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు, ఖాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ కాంబోజి రెడ్డెప్ప శెట్టి కుమారుడు వెంకటేశ్‌ నిర్వహిస్తున్న రైసు మిల్లు కోటా బియ్యం అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. అనంతపురం, కడప జిల్లాల నుంచి రేషన్‌ బియ్యం తరలించడం, ఆ బియ్యాన్ని పాలిష్‌ చేయడం, అధిక ధరలకు అమ్ముకోవడం సర్వసాధారణమైంది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా అధికారులందరూ ఇందులో భాగస్వాములేనని విస్తృతంగా చర్చించుకుంటున్నారు. కదిరి పట్టణంలో శుక్రవారం వైసీపీ నాయకుడు వెంకటేశ్‌ మిల్లులో 1600 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుబడటంతో అక్రమ వ్యాపారం బహిర్గతమైంది.
రెండేళ్లుగా పేదోళ్ల బియ్యం కడప, అనంతపురం జిల్లాల నుంచి వందలాది టన్నులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. అయినా రెవెన్యూ అధికారులు, పోలీస్‌లు, ప్రత్యేక నిఘా విభాగాలు పట్టించుకోలేదు. అంటే ఇందులో అవినీతి ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. చౌకబియ్యం అక్రమ వ్యాపారాన్ని కదిరి పోలీసులు కాకుండా పొరుగున గల ముదిగుబ్బ పోలీసులు పట్టుకోవడంతో అసలు కథ బయటికి వచ్చింది. కదిరి పట్టణంలో రెవెన్యూ డివిజనల్‌, పోలీస్‌ డివిజనల్‌ కార్యాలయాలు ఉన్నాయి. అయినా కదిరిలో ఇంత పెద్దఎత్తున జరుగుతున్న అక్రమ సబ్సిడీ బియ్యం దందాను పసికట్టలేకపోయారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప నుండి బియ్యం అక్రమంగా కదిరికి తరలించడమంటే ఇందులో రాజకీయ జోక్యం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img