Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కోర్టుల్లో పెండిరగ్‌ కేసులు రెట్టింపు

న్యాయ శాఖ మంత్రి రిజిజు ఆందోళన
రాయ్‌పూర్‌ : దేశంలోని వివిధ కోర్టుల్లో పెండిరగ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు శనివారం అన్నారు. పెండిరగ్‌లో ఉన్న కేసులు పెరగడం వల్ల విషయాలను వినడం లేదా పరిష్కరించడం లేదని అర్థం కాదని, బదులుగా ప్రతిరోజూ పరిష్కరించబడుతున్న కేసుల కంటే తాజా కేసుల సంఖ్య రెట్టింపు కావడం వల్లనే అని ఆయన తెలిపారు. నవా రాయ్‌పూర్‌ అటల్‌ నగర్‌లోని సెంట్రల్‌ సెక్రటేరియట్‌ భవనంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ) రాయ్‌పూర్‌ బెంచ్‌ నూతన కార్యాలయ ఆవరణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ‘నేను న్యాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు వివిధ కోర్టుల్లో దాదాపు 4.50 కోట్ల కేసులు పెండిరగ్‌లో ఉన్నాయి. ఆ సంఖ్య 5 కోట్లకు చేరుకుంటుంది. అయితే కేసులను పరిష్కరించడం లేదని కాదు. కొత్త కేసుల సంఖ్య పరిష్కారమయ్యే కేసుల సంఖ్య కంటే రెట్టింపు. ఉదాహరణకు, ఒక హైకోర్టు రోజుకు 300 కేసులను పరిష్కరిస్తే, 600 కొత్త కేసులు విచారణకు వస్తాయి’ అని తెలిపారు. ‘దీనిని నిశితంగా అర్థం చేసుకోవడం అవసరం. కేసుల పరిష్కార రేటు పెరగడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవడం వల్ల కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడుతున్నా… పెండిరగ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాపారం పెరుగుతున్నందున వివాదాలు పెరుగుతున్నాయి. వ్యాపారం లేకపోతే కేసులు ఉండవు. ఒక విధంగా, ఇది సానుకూల విషయమే కానీ సానుకూల అభివృద్ధికి కొంత పరిష్కారం ఉండాలి’ అని అన్నారు. రిజిజు ఐటీఏటీని ప్రశంసించారు. కరోనా వైరస్‌ ప్రేరేపిత లాక్‌డౌన్ల సమయంలో దాని పెండిరగ్‌ కేసులను తగ్గించిందని చెప్పారు. సకాలంలో న్యాయం జరగాలని, లేకుంటే ఆలస్యమైన న్యాయానికి విలువ ఉండదని నొక్కి చెప్పిన కేంద్ర మంత్రి, ‘సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులతో నేను జరిపిన చర్చల సందర్భంగా మేము (ఆయన మంత్రిత్వ శాఖ) అన్ని విధాలా మద్దతును పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాను. కానీ సకాలంలో న్యాయం అందేలా చూడాలి. న్యాయం, సామాన్య ప్రజలకు మధ్య దూరం ఉండకూడదు’ అని తెలిపారు. పెండిరగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతామని చెప్పారు. ‘కేసు విచారణ జరుగుతున్న కోర్టు, ఎంతకాలం పెండిరగ్‌కు కారణం, సంబంధిత బెంచ్‌, లాయర్ల పేరు (వివరాలు ఉంటాయి). ఇది న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఒత్తిడిని కలిగిస్తుంది’ అని మంత్రి తెలిపారు. ఇ-కోర్టులపై పెద్ద ప్రతిపాదన కూడా ఉందని, కోర్టులో స్థానిక భాషల వినియోగాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. అనంతరం రిజిజు విలేకరులతో మాట్లాడుతూ సబార్డినేట్‌ కోర్టుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ద్రవ్యోల్బణంపై మాట్లాడుతూ చత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని, కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రెండుసార్లు తగ్గించిందని, అదేవిధంగా ధరల పెరుగుదలను నియంత్రించడానికి, ఈ ఇంధనాలపై పన్ను (వ్యాట్‌) తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి గురించి ప్రశ్నించగా, ఇది తీవ్రమైన సమస్య అని, దానిని వివరంగా చెప్పాల్సి ఉంటుందని అంటూ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img