Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కోర్టుల్లో స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలి

సీఎంలు, హైకోర్టు సీజేల సదస్సులో మోదీ
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమావేశం ఢల్లీిలో శనివారం ఉదయం ప్రారంభమైంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రారంభించిన ఈ సమావేశంలో ప్రదాని మోదీ కీలక ప్రసంగం చేశారు.దేశంలో ప్రధానమైన న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్చలు చేపడతామన్నారు. న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టుల్లో స్థానిక భాషకే ప్రాధాన్యమివ్వాలని మోదీ పిలుపునిచ్చారు. ‘ఈ అమృత కాలంలో న్యాయవ్యవస్థపై మనం దృష్టి పెట్టాలి. ప్రతిఒక్కరికి సులభంగా, త్వరతగతిన న్యాయం అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశంలో న్యాయవిద్యను అంతర్జాతీయ ప్రమాణాలతో అందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కోర్టుల్లోని న్యాయ వ్యవహారాలన్నీ ఆంగ్ల భాషలోనే జరుగుతున్నాయి. సామాన్యులకు అర్థమయ్యేలా న్యాయ భాషను రూపొందించాల్సి అవసరం ఉంది. కోర్టుల్లో స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే సామాన్యులకు న్యాయవ్యవస్థపై నమ్మకం మరింత పెరుగుతుంది’ అని మోదీ సూచించారు. డిజిటల్‌ ఇండియా ప్రగతిలో అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల సీజేలు తమతో కలిసి రావాలని ప్రధాని మోదీ కోరారు. న్యాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. సమస్యల పరిష్కారంలో న్యాయ వ్యవస్థది పాత్ర కీలకమని మోదీ పేర్కొన్నారు. దేశంలో డిజిటల్‌ లావాదేవీలు అసంభవమని కొందరు అన్నారన్న మోదీ… నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్‌ నిలిచిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img