Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా ?

ఏమవుతుందిలే అని బరి తెగింపా ?
ఐఏఎస్‌లపై హైకోర్టు ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఉపాధిహామీ బిల్లుల చెల్లింపు కేసులో ఐఏఎస్‌లపై హైకోర్టు శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వులంటే మీకు లెక్కలేదా ? లేక ఏమవుతుందిలే అని బరితెగింపా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్‌ అధికారులు భ్రమల్లో ఉండవద్దని హితవు పలికింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో ద్వివేది, రావత్‌ హాజరుకావటంపై విస్మయం వ్యక్తం చేసింది. రోజూ మిమ్మల్ని చూసేందుకు చికాకు వేస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ హైకోర్టులోనే కోర్టు ధిక్కరణ కేసులు ఎక్కువని న్యాయస్థానం తెలిపింది. అధికారుల తీరు వల్లే ఈ పరిస్థితి అంటూ పేర్కొంది. దాదాపు 70 కోర్టుధిక్కరణ కేసుల్లో ఉన్న ద్వివేది, రావత్‌ లను ఉద్దేశించి న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img