Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కోవాగ్జిన్‌తో 93.4 శాతం రక్షణ

కోవిడ్‌ నియంత్రణ కోసం భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా కొవిడ్‌ తీవ్ర లక్షణాల నుంచి 93.4 శాతం కాపాడే సామర్థ్యాన్ని కనబరిచిందని ప్రముఖ జర్నల్‌ లాన్సెట్‌ కథనం వెల్లడిరచింది. ఈ టీకా మూడో దశ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను జర్నల్‌లో ప్రచురించారు. దీని ప్రకారం ప్రయోగాల్లో పాల్గొన్న వారిలో 0.5 శాతం కంటే తక్కువమందిలో మాత్రమే తీవ్ర దుష్పరిణామాలు తలెత్తాయి. డేల్టా వేరియంట్‌ నుంచి 65.2 శాతం కాపాడగలిగే సామర్థ్యం కొవాగ్జిన్‌కు ఉన్నట్లు ప్రాథమిక విశ్లేషణలో తేలింది. దీనికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. అన్ని రకాల కొవిడ్‌ స్ట్రైయిన్స్‌ నుంచి 70.8 శాతం రక్షణ ఇస్తుంది. ఈ వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాల్లో దేశవ్యాప్తంగా 25 వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 25,800 మంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img