Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కోవాగ్జిన్‌ సరఫరా నిలిపివేత అందుకే…


డబ్ల్యూహెచ్‌ఓ
న్యూదిల్లీ : హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ తయారు చేసే కోవిడ్‌ వాక్సిన్‌ ‘కోవాగ్జిన్‌’ ఐరాస ఏజెన్సీల ద్వారా సేకరణను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ నెల 2న నిలిపివేసింది. అనంతరం భారత్‌ బయోటెక్‌ పరిశ్రమలను పర్యవేక్షించింది. సరఫరా నిలిపివేసినందుకు సంస్థ చెప్పిన ఏకైక కారణం.. ఉత్పత్తి పద్ధతుల్లో నాణ్యత లేకపోవడం. ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయి… ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో మాత్రం తెలపలేదు. ఇదే విషయమై డబ్ల్యూహెచ్‌ఓను ది వైర్‌ సైన్స్‌ సంప్రదించగా ‘ఉత్పత్తి పద్ధతుల్లో సమస్యలను గుర్తించాం. అత్యవసర వినియోగ లైసెన్స్‌ తర్వాత కొన్ని మార్పులు జరిగాయి. వాటి ధృవీకరణ కోసం జాతీయ డ్రగ్‌ రెగ్యులేటర్‌నుగానీ డబ్ల్యూహెచ్‌ఓకిగానీ సంప్రదించలేదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. డబ్ల్యూహెచ్‌ఓ అనుమతులు లభించిన తర్వాత ఉత్పత్తి విధానాల్లో ప్రధాన మార్పులు చేసినట్లు అయితే వాటి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌ఓకు లేదా జాతీయ డ్రగ్‌ రెగ్యులేటర్‌కు వాక్సిన్‌ తయారీదారులు అందజేయాలని ప్రభుత్వ కంపెనీలో వాక్సిన్‌ ఉత్పత్తితో ముడిపడివున్న గుడ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌ (జీఎంపీ) నిపుణుడు ఒకరు తెలిపారు. దీనిని ఛేంజ్‌ కంట్రోలర్‌ అప్రూవల్‌ అంటారని, ఈ కారణంగానే కోవాగ్జిన్‌ సరఫరాను డబ్ల్యూహెచ్‌ఓ నిలిపివేసిందన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం ఇది సమస్య అని సూటిగా చెప్పలేదుగానీ విశ్వసనీయ సమాచారం ఇవ్వలేమని, మరిన్ని వివరాలు కావాలంటే భారత్‌ బయోటెక్‌ను అడగాలని సూచించింది. దీంతో ఆ కంపెనీతో పాటు డీసీజీఐని 12వ తేదీన దివైర్‌ సైన్స్‌ సంప్రదించగా స్పందన లేదు. ఉత్పత్తి విధానాల్లో మార్పును భారత్‌ బయోటెక్‌ చేయడానికి కారణం వాక్సిన్‌ డోసులను పెంచడం లేక ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల పరిమాణాన్ని తగ్గించడం అయి ఉండాలని జీఎంపీ నిపుణుడు అంచనా వేశారు. కోవాగ్జిన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ను నిలిపివేయడమే కాకుండా ఈ వాక్సిన్‌ను వినియోగించే దేశాలకు తగు చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. వాక్సిన్‌ సమర్థమైనదిగా డేటా సూచిస్తోందని కూడా పేర్కొంది. వాక్సిన్‌ సురక్షితమైతే దేశాలు ఏం చర్యలు తీసుకోవాలన్నది ప్రశ్నార్థకం. కాగా, వాక్సిన్‌ సురక్షితమైనది, సమర్థంగా పనిచేస్తుంది. అలాంటప్పుడు సరఫరాను నిలిపివేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఫార్మాస్యూటికల్‌ సప్లై చెయిన్స్‌ నిపుణులు నీతా సంఫీు ది వైర్‌ సైన్స్‌తో అన్నారు. ఇదిలావుంటే, ఈ సమస్యను అధిగమించడమే భారత్‌ బయోటెక్‌ చేయాల్సిందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. డీసీజీఐ, డబ్ల్యూహెచ్‌ఓకు సమర్పించే కరెక్టీవ్‌, ప్రివెన్టీవ్‌ కార్యాచరణ ప్రణాళికలో ఆయా వివరాలను కంపెనీ వెల్లడిరచాలి అయితే ఇందుకోసం డెడ్‌లైన్‌ విధించలేదు. డబ్ల్యూహెచ్‌ఓ ఆదేశాలకు ముందు రోజు అంటే ఏప్రిల్‌ 1న భారత్‌ బయోటెక్‌ ఓ ప్రకటనలో కోవాగ్జిన్‌కు డిమాండు తగ్గిన క్రమంలో ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు తెలిపింది. తయారీ యూనిట్లను అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉందని, మహమ్మారి కారణంగా అది కుదరలేదని పేర్కొంది. డిమాండు తగ్గిన క్రమంలో ఆయా చర్యలను చేపడుతున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img