Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

క్వాడ్‌ భేటీకి హాజరుకానున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. సెప్టెంబర్‌ 24వ తేదీన అమెరికా ప్రభుత్వం నిర్వహించనున్న క్వాడ్‌ సదస్సులో ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. జో బైడెన్‌ ఆతిథ్యంలో వాషింగ్టన్‌లో జరగనున్న క్వాడ్‌ నేతల సదస్సులో మోదీ పాల్గొననున్నారని, భేటీ తర్వాత సెప్టెంబర్‌ 25న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలోనూ ప్రసంగించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడిరచింది. క్వాడ్‌ సదస్సుకు మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగాలు కూడా హాజరుకానున్నారు. ఈ నలుగురు నేతలు పలు అంశాలపై ప్రత్యక్షంగా చర్చించనున్నారు. 25న ఐరాస సర్వసభ్య సమావేశం 76 సెషన్‌లో జరిగే జనరల్‌ డిబెట్‌లో ప్రధాని మోదీ పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ తెలిపింది. కొవిడ్‌19 నుంచి రికవరీ, పునర్‌ నిర్మాణం, ప్రజల హక్కులను గౌరవించడం లాంటి అంశాలను ఈ ఏడాది థీమ్‌గా యూఎన్‌ ఎంచుకున్నది. నిజానికి మార్చిలోనే తొలి క్వాడ్‌ సమావేశాలను బైడెన్‌ ఏర్పాటు చేశారు. వర్చువల్‌ రీతిలో ఆ సమావేశాలు జరిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img