Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

క్షీణించిన విద్యా ప్రమాణాలు

తెలుగు రాష్ట్రాలోనూ ఇదే పరిస్థితి
నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే వెల్లడి

న్యూదిల్లీ : దేశంలో విద్యా ప్రమాణాలు క్షీణించాయి. పంజాబ్‌, రాజస్థాన్‌ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2017 కంటే ముందు స్థాయికి విద్యా ప్రమాణాలు పడిపోయాయని నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే-2021 తాజాగా వెల్లడిరచింది. అయితే కొవిడ్‌ మహమ్మారి ఇందుకు ప్రధాన కారణమై ఉంటుందని సర్వే తెలిపింది. దేశంలోని 720 జిల్లాల్లో ఉన్న 1.18 లక్షల పాఠశాలలను పరిశీలించిన అనంతరం తాజా సర్వే నివేదికను రూపొందించినట్లు ఎన్‌ఏఎస్‌ పేర్కొంది. 34 లక్షల మంది విద్యార్థులు ఈ సర్వే పాల్గొన్నారు. ఇదిలాఉండగా, పిల్లల విద్యాభ్యాసం విషయంలో కనీసం 25 శాతం పాఠశాలలకు విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతు లేదని సర్వేలో గుర్తించారు. 3 నుంచి 5వ తరగతి స్థాయిలో గణితం, భాషా నైపుణ్యాలు, పర్యావరణ శాస్త్రం వంటి విషయాలపై పరిశీలన చేసినట్లు వివరించింది. అయితే పంజాబ్‌, రాజస్థాన్‌ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 2017 నాటి దేశ సగటు కంటే తక్కువ ప్రమాణాలు నమోదయ్యాయని పేర్కొంది. ఈ విషయంలో తెలంగాణ, అరుణాచల్‌ ప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు చివరి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. అయితే 5వ తరగతి స్థాయిలో జమ్ముకశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ కొంత మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. అలాగే 8వ తరగతి స్థాయిలో గణితం, భాషా నైపుణ్యం, సైన్స్‌, సోషల్‌ లాంటి అంశాలను పరిశీలించగా అక్కడ కూడా ఇవే ఫలితాలు వచ్చాయని, ఈ స్థాయిలో చత్తీస్‌గఢ్‌ కొంత మెరుగ్గా ఉన్నట్లు ఎన్‌ఏఎస్‌ వెల్లడిరచింది.
బడికెళ్లాలంటే కాలి నడకే శరణ్యం
దేశవ్యాప్తంగా 48 శాతం మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలలకు వెళుతున్నట్లు సర్వేలో తేలింది. 18 శాతం మంది సైకిళ్లపై పాఠశాలలకు చేరుకుంటుండగా, పాఠశాల రవాణా, ప్రజా రవాణాను ఉపయోగించుకుంటున్నవారు కేవలం 9 శాతం మంది ఉన్నారు. 8 శాతం మంది సొంత వాహనం (ద్విచక్ర) పై, 3 శాతం మంది సొంత కార్లలో పాఠశాలలకు వెళుతున్నారని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img