Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

గుజరాత్‌లో మరో వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌

దేశంలో మూడుకు చేరిన కేసుల సంఖ్య
దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఇద్దరిలో ఈ వేరియంట్‌ వెలుగు చూడగా, మరికొందరు అనుమానితులు పర్యవేక్షణలో ఉన్నారు. తాజాగా ఇవాళ గుజరాత్‌లో మరో వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన ఓ వ్యక్తిలో ఈ కొత్త వేరియంట్‌ ఉన్నట్లు బయటపడిరది. దాంతో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది.ఈ వేరియంట్‌ మొదటగా ఆఫ్రికా ఖండంలోని దక్షిణ దేశాల్లో గుర్తించారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ బయటపడగానే భారత్‌ సహా అన్ని దేశాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. అయినా, ఆ వేరియంట్‌ ఇప్పటికే 38 దేశాలకు విస్తరించింది. ఒమిక్రాన్‌ వేగాన్ని చూసి అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని భయంతో వణికిపోతున్నాయి. ఇప్పటికే కరోనా గత వేరియంట్‌లు మిగిల్చిన చేదు అనుభవాల నుంచి ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. ఒమిక్రాన్‌పై ఆందోళన నేపథ్యంలో భారత్‌లో విదేశీ ప్రయాణికుల్ని గుర్తించడం, పరీక్షించడంలాంటి చర్యలు మళ్లీ ప్రారంభించారు. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో 30కి పైగా ఉత్పరివర్తనాలు జరిగినట్లు పలువురు చెబుతున్నారు. ఈ మ్యూటేషన్లే ప్రమాదకరంగా మారవచ్చన్న ఆందోళన నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img