Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గురువులకు దగా

వైసీపీ హయాంలోమూడు టీచర్స్‌ డేలు
ఒక్క డీఎస్సీ ప్రకటించ లేదు
సీపీఎస్‌, పీఆర్సీలపై మౌనం
సంక్షేమాలతో విద్యకు పెద్దపీటన్న మంత్రి సురేశ్‌

అమరావతి : ఉపాధ్యాయ దినోత్సవం సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం గురువులను దగా చేసింది. పాదయాత్రలోను, ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ శిక్షణార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్య బలోపేతం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అంద రూ స్వాగతిస్తున్నప్పటికీ, విద్యారంగంలో మానవ వనరుల అభివృద్ధి జరగలేదు. సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు ఉపాధ్యాయ దినోత్సవాలు వచ్చినా ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు. డీఎస్సీ ప్రకటన కోసం రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు పడిగాపులు కాస్తు న్నారు. అందులో కొందరి వయోపరిమితి దగ్గర పడిరది. ఉపాధ్యాయ, ఉద్యోగులకు జగన్‌ ఇచ్చిన హామీల అమలులోనూ జాప్యం జరుగుతోంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) రద్దు హామీపై ప్రభుత్వం మౌనం వహించింది. పీఆర్సీని అమలు చేయలేదు. డీఏలు పెండిరగ్‌లో పెట్టేశారు. నెలవారీ పదోన్నతులు సక్రమంగా ఇవ్వడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రకటించిన డీఎస్సీ2018 పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేసి, చేతులు దులుపుకుంది. రాష్ట్రంలో 25వేల ఖాళీలను ఉపాధ్యాయ దినోత్సవం నాడు ప్రకటిస్తారని ఆశించిన అభ్యర్థులు భంగపాటుకు గురయ్యారు. కరోనా కారణంగా రాష్ట్రంలో చాలామంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయారు. నూతన విద్యావిధానం అమలుతోపాటు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాం వరకు డీఎస్సీకి ఓసీ అభ్యర్థులకు 44ఏళ్ల వయోపరిమితి ఉండగా, ఇప్పుడు దానిని కేవలం 42 ఏళ్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం సంకేతాలను ఇస్తోంది. ఇందుకు నిదర్శనంగా సాంఘిక సంక్షేమశాఖ ఇటీవల విడుదల చేసిన బ్యాక్‌లాగ్‌

పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీల వయోపరిమితిని 42G5R47గా నిర్ధారించి, ఎంపిక ప్రక్రియను చేపట్టింది.
కరోనా వల్ల నిర్వహించలేదు : మంత్రి ఆదిమూలపు సురేష్‌
కరోనా కారణంగా ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించలేకపోతున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడిరచారు. టీచర్స్‌ డే సందర్బంగా మంత్రి సురేష్‌ జూమ్‌ సమావేశంలో ప్రసంగించారు. దీనికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. మంత్రి సురేష్‌ మాట్లాడుతూ విద్య ద్వారానే భావితరాలకు బంగారు బాటలు వేయవచ్చని తెలిసిన ముఖ్యమంత్రి…విద్య అందరికీ అందేలా రెండేళ్లుగా కృషి చేస్తున్నారన్నారు. జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, విద్యాదీవెన తదితర సంక్షేమ కార్యక్రమాల ద్వారా పిల్లల తల్లిదండ్రుల్లో ఆర్థిక స్టైర్యాన్ని పెంచామని చెప్పారు. భవిష్యత్‌ తరాల అభ్యున్నతికి విద్య ద్వారానే పునాది వేసేందుకు సీఎం జగన్‌ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారన్నారు. గురుశిష్యుల బంధం విడదీయరానిదన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి అభినందనలు తెలిపారు. కరోనాతో మరణించిన ఉపాధ్యాయులకు సంతాపం తెలిపారు.
హామీలు నెరవేర్చలేదు: జోసఫ్‌ సుధీర్‌బాబు
జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర, మేనిఫెస్టోలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సీపీఎస్‌ రద్దు చేయలేదు. పీఆర్‌సీ అమలు చేయలేదు. ఆరు డీఏలకుగాను ఒక డీఏ మాత్రమే ఇచ్చారు. నెలవారీ పదోన్నతులు ఒక్కసారికే పరిమితం చేశారు. రేషనలైజేషన్‌ అనంతరం ఉపాధ్యాయ ఖాళీలు 25వేలు ఉండగా, రెండున్నరేళ్లలో ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు. ఎన్నికల హామీ మరిచారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవానికైనా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, డీఎస్సీ ఖాళీల భర్తీపై ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం దురదృష్టకరం.
మెగా డీఎస్సీ ఏమైంది ?: లోకేష్‌
మొదటి ఏడాదే మెగా డీఎస్సీ అని ప్రకటించిన సీఎం జగన్‌…ఇంతవరకు ఆ మాటే ఎత్తడం లేదు. ఉపాధ్యాయులను గౌరవించి, పూజించే సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదు. వారికి ఆకలి బాధలు లేకుండా చేస్తే అదే పదివేలు. కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు పరిహారం ప్రకటించలేదు. జీవితంలో ఎదగడానికే కాదు, మన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలోనూ ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img