Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మోడీ పాలనలో కశ్మీరీయుల హక్కుల సంగతేంటి?

మెహబూబా ముఫ్తీ
జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని మంగళవారం మళ్లీ గృహ నిర్బంధంలో ఉంచారు. కశ్మీరులో సాధారణ పరిస్థితులు లేనందున ఆమెను గృహనిర్బంధంలో ఉంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే కశ్మీరులో సాధారణ పరిస్థితులు లేవనే తప్పుడు వాదనలతో ఈ రోజు తనను గృహనిర్బంధంలో ఉంచారని ముఫ్తీ ట్వీట్‌ చేశారు. అఫ్ఘాన్‌ ప్రజల హక్కుల కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్న భారత ప్రభుత్వం కశ్మీరీయుల హక్కులను ఉద్ధేశపూర్వకంగా కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో కశ్మీరీయుల హక్కుల సంగతేంటని ప్రశ్నించారు. కశ్మీరును ఓపెన్‌ ఎయిర్‌ జైలుగా మార్చారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img