Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ఎఫెక్ట్‌.. పలు రైళ్లు రద్దు

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణించే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం ఉదయం సికింద్రాబద్‌కు సమీపంలోని బీబీ నగర్‌-ఘట్కేసర్‌ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఈ మేరకు రద్దు చేసిన ట్రైన్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కొన్ని ట్రైన్లను నేడు రద్దు చేయగా.. మరికొన్ని ట్రైన్లను దారి మళ్లించనున్నారు.రద్దు అయిన ట్రైన్ల విషయానికొస్తే.. కాచిగూడ-నడికూడు(07791), నడికూడు-కాచిగూడ(07792), సికింద్రాబాద్‌-వరంగల్‌(07462), వరంగల్‌-సికింద్రాబాద్‌(07463), సికింద్రాబాద్‌-గుంటూరు(12706), గుంటూరు-సికింద్రాబాద్‌(17645) రైళ్లు ఇవాళ ఒక్కరోజు పూర్తిగా రద్దు చేశారు. ఇక సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌-సికింద్రాబాద్‌(17234) రైలును కాజిపేట్‌-సికింద్రాబాద్‌ మధ్య, సికింద్రాబాద్‌-గుంటూరు(17202) ట్రైన్‌ను సికింద్రాబాద్‌-కాజీపేట్‌ మధ్య, విజయవాడ-సికింద్రాబాద్‌(12713) ట్రైన్‌ను వరంగల్‌-సికింద్రాబాద్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.అలాగే సికింద్రాబాద్‌-విజయవాడ(12714) ట్రైన్‌ను సికింద్రాబాద్‌-వరంగల్‌ మధ్య, భద్రాచలం రోడ్‌-సికింద్రాబాద్‌(17660) రైలును కాజీపేట్‌-సికింద్రాబాద్‌ మధ్య, గుంటూరు-వికారాబాద్‌(12747) రైలును నల్లగొండ-వికారాబాద్‌ మధ్య, వికారాబాద్‌-గుంటూరు(12748) ట్రైన్‌ను వికారాబాద్‌-నల్లగొండ మధ్య, వరంగల్‌-సికింద్రాబాద్‌(07757) ట్రైన్‌ను ఆలేరు-సికింద్రాబాద్‌ మధ్య, మిర్యాలగూడ-కాచిగూడ(07974) రైలును రామన్నపేట్‌-కాచిగూడ, కాచిగూడ-మిర్యాలగూడ(07276) ట్రైన్‌ను కాచిగూడ-రామన్నపేట్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.ఇక గుంటూరు-సికింద్రాబాద్‌(17201) ట్రైన్‌ను కాజీపేట్‌-సికింద్రాబాద్‌ మధ్య, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌(17233)రైలును సికింద్రాబాద్‌-కాజీపేట్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఇక లింగంపల్లి-విశాఖపట్నం(12806) ట్రైన్‌ను సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య, విశాఖపట్నం-లింగంపల్లి(12806) ట్రైన్‌ను విజయవాడ-లింగంపల్లి మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇక తిరుపతి-జమ్ము తావి(22705) రైలును సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, కాగజ్‌ గర్‌, పెద్దపల్లి మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img