Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గోధుమ మద్దతు ధర క్వింటాకు రూ.2,015

దశాబ్దంలో కనిష్టంగా2 శాతం పెంచిన కేంద్రం
బార్లీకి రూ.1,635గా నిర్ణయం

న్యూదిల్లీ : రైతుల నుంచి కొత్త సీజన్‌లో గోధుమల కొనుగోలుకు చెల్లించే ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది.
దశాబ్దంలోనే కనిష్ఠంగా రూ.40(2 శాతం) పెంపుతో క్వింటాల్‌కు రూ.2,015గా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని నిర్ణయించింది. రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు పంటల సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రస్తుత పంటల సంవత్సరానికి కేంద్రం మద్దతు ధరలను ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌

కమిటీ(సీసీఈఏ) కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆవాలుకు రూ.400 పెంచుతూ క్వింటాల్‌కు 5,050గా మద్దతు ధరను ప్రకటించింది. కాగా ప్రస్తుతం, ప్రభుత్వం ఖరీఫ్‌, రబీ సీజన్‌లో 23 పంటలకు మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. ఖరీఫ్‌(వేసవి) సాగు అయిన వెంటనే అక్టోబరు నుంచి రబీ(శీతాకాలం) పంటల సాగు ప్రారంభమవుతుంది. గోధుమ, ఆవాలు రబీ ప్రధాన పంటలుగా ఉన్నాయి. మోదీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులపై ప్రైవేట్‌ సంస్థలకు నియంత్రణ ఇవ్వడం ద్వారా తమను దెబ్బతీస్తుందని మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను పెంచే చర్య వచ్చింది. 202122 పంట సంవత్సరం(జులైజూన్‌) 202223 మార్కెటింగ్‌ సీజన్‌కు ఆరు రబీ పంటలకు ఎంఎస్‌పీల్లో పెంపును సీసీఈఏ ఆమోదించినట్లు ఒక అధికారిక ప్రకటన విడులయింది. ఈ పంట సంవత్సరానికి గోధుమకు క్వింటాకు రూ.40 పెంపుతో కనీస మద్దతు ధర రూ.2,015గా నిర్ణయించారు. అయితే 202122 పంట సంవత్సరంలో గోధుమ ధర క్వింటాల్‌కు రూ.1,975గా ఉంది. ఇదిలాఉండగా, గోధుమ ఉత్పత్తి వ్యయం క్వింటాకు రూ.1,008గా అంచనా వేసినట్లు ఆ ప్రకటన పేర్కొంది. 202122 రబీ మార్కెటింగ్‌ సీజన్‌ సమయంలో ప్రభుత్వం రికార్డు స్థాయిలో 43 మిలియన్ల టన్నులకు పైగా గోధుమలను సేకరించినట్లు వివరించింది. 202122 పంట సంవత్సరానికి బార్లీకి కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.35 పెంపుతో రూ.1,635గా నిర్ణయించింది. మునుపటి సంవత్సరం ఇది క్వింటాల్‌కు రూ.1,600గా ఉంది. అలాగే తృణ ధాన్యాల విషయానికొస్తే, శనగలకు రూ.130 పెంచడం ద్వారా కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.5,100 నుంచి రూ.5,230కు చేర్చింది. ఇక పప్పు ధాన్యాలకు రూ.400 పెంచి, క్వింటాల్‌కు రూ.5,100 నుంచి రూ,5,500కు పెంచింది. ఇక నూనె గింజల విషయానికొస్తే, 2021`22 సంవత్సరానికి ఆవ గింజలకు రూ.400 పెంచడం ద్వారా క్వింటాల్‌కు రూ.5,050గా నిర్ణయించింది. గత సంవత్సరం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,650గా ఉంది. అదేవిధంగా కుసుమ గింజలకు క్వింటాల్‌కు రూ.114 పెంచి, గత ఏడాది రూ.5,327 నుంచి రూ.5,441గా మద్దతు ధరను నిర్ణయించింది. ‘గోధుమ, ఆవాలు (100 శాతం), దాని తరువాత పప్పు ధాన్యాలు (79 శాతం), శనగలు (74 శాతం), బార్లీ (60 శాతం), కుసుమ (50 శాతం) నేపథ్యంలో వాటి ఉత్పత్తి వ్యయంపై రైతులు ఆశించే రాబడి అత్యధికంగా అంచనా వేయబడిరది’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రైతులు ఈ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు, ఉత్తమ సాంకేతికతలు, వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి, ప్రోత్సహించడానికి, డిమాండ్‌ను సరిచేయడానికి సంఘటిత ప్రయత్నాలు జరిగాయని, గత కొన్ని సంవత్సరాలుగా నూనె గింజలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలకు అనుకూలంగా ఎంఎస్‌పీలను మార్పు చేసినట్లు వివరించింది.
జౌళి రంగానికి రూ.10 వేల కోట్లతో కొత్త పథకం
దేశీయ ఉత్పత్తి, ఎగుమతులను ప్రోత్సహించేందుకు జౌళి రంగానికి రూ.10,683 కోట్లతో ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహకం(పీఎల్‌ఐ) పథకానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం 7.5 లక్షల మందికి పైగా, అలాగే కార్యకలాపాలకు మద్దతుగా అనేక లక్షల మందికి అదనంగా ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడానికి దోహదపడుతుంది. జౌళి రంగానికి ఆమోదించిన ప్రోత్సాహాకాలలో భాగంగా ఐదు సంవత్సరాలకు పైగా కాలానికి చెల్లింపు విస్తరించబడుతుంది. ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎంఎంఎఫ్‌(మానవ నిర్మిత ఫైబర్‌) దుస్తులు, ఎంఎంఎఫ్‌ ఫ్యాబ్రిక్స్‌, సాంకేతిక వస్త్రాల ఉత్పత్తి లేదా 10 విభాగాలకు ఈ పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం వలన వీటిలో అధిక విలువ కలిగిన ఉత్పత్తి జరుగుతుంది. కాగా ప్రభుత్వ అంచనా ప్రకారం, ఐదు సంవత్సరాలలో ఈ పథకానికి రూ.3 లక్షల కోట్ల సంచిత టర్నోవర్‌తోపాటు రూ.19 వేల కోట్లకు పైగా తాజా పెట్టుబడిన అందిస్తుంది. వస్త్రాల కోసం ఉత్పత్తి-అనుబంధ ప్రోత్సాహక పథకం బడ్జెట్‌ 2021-22 సమయంలో గతంలో చేసిన 13 రంగాలకు సంబంధించిన మొత్తం ప్రకటనలో భాగంగా 1.97 లక్షల కోట్ల వ్యయంతో ఉంది. గ్రామీణ ప్రాంతాలు, జిల్లాలు, టైర్‌ 3, టైర్‌ 4 పట్టణాలకు పెట్టుబడి అందించడం ఈ పథకం ప్రాధాన్యతగా ఉంది. ప్రధానంగా వస్త్ర పరిశ్రమ మహిళలకు ఉపాధి కల్పిస్తుందని, పీఎల్‌ఐ పథకం మహిళలను ప్రోత్సహిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img