Friday, April 19, 2024
Friday, April 19, 2024

గ్యాస్‌బండ మళ్లీ రూ.25 పెరిగిన ధర

న్యూదిల్లీ : కోవిడ్‌ కష్టకాలంలో ధరల మోత ఆగక సామాన్యుడు విలవిల్లాడి పోతున్నాడు. తాజాగా వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరపై రూ.25 పెరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగడం నెలలో ఇది రెండవసారి. పెరిగిన ధరలతో దేశ రాజధాని దిల్లీలో 14.2కేజీ సిలిండర్‌ సబ్సిడీ ధర రూ.859గా ఉంది. జులై1న సిలిండర్‌పై రూ.25.50 పెరిగింది. సబ్సిడీయేతర ఎల్‌పీజీ ధరలు ఆగస్టు 1 నుంచి పెరుగగా ఇప్పుడు మళ్లీ సబ్సిడీ వంటగ్యాస్‌ ధర పెరి గింది. తాజా పెంపుతో జనవరి 1 నుంచి సిలిండర్‌ ధరపై రూ.165 చొప్పున పెరిగింది. కొత్త ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక రాజధాని ముంబైలో సిలిండర్‌ ధర రూ.859.50 ఉంటే కోల్‌కతాలో రూ.886కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్‌ ధరల్లో మార్పులు ఉంటాయి. స్థానిక ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం కూడా ధరలపై ఉంటుంది. మరోవైపు దిల్లీలో పెట్రోల్‌ ధర రూ.101.84గా ఉంటే డీజిల్‌ ధర కాస్త తగ్గి రూ.89.67గా నమోదు అయింది. ముంబైలో లీటరు రూ.97.24 ధర పలుకుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img