Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు రూ.36వేల కోట్ల ‘పీపీపీ’ పెట్టుబడులు

కేంద్రమంత్రి వీకే సింగ్‌
న్యూదిల్లీ : గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రాయాల అభివృద్ధి కోసం రూ.36వేల కోట్ల విలువగల పెట్టుబడులను ప్రభుత్వ`ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో పెట్టాలని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి వీకే సింగ్‌ గురువారం తెలిపారు. దేశ పౌర విమానాయన రంగం ఎదుర్కొనే సవాళ్లలో జెట్‌ ఇంధనంపై అత్యధిక పన్నులు, ‘హైలీ ప్రైస్‌ సెన్సిటీవ్‌ కస్టమర్లు’ అని ఆయనన్నారు. విమానాశ్రయాల్లో విమానాల సురక్షిత నిర్వహణకు హామీనిచ్చే చర్యలు సరిపడ ఉన్నాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు. టేబుల్‌ టాప్‌ రన్‌వేలు ఉన్నాయని, అంతర్జాతీయ పౌర విమానయాన సంఘాల ప్రమాణాలు, డీజీసీఏ పౌర విమానాయనం అవసరాలకు అనుగుణంగానే అన్ని చర్యలు ఉన్నట్లు తెలిపారు. కోవిడ్‌ నేపథ్యంలో విమానయాన రంగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొందన్నారు. కొన్ని ఎయిర్‌లైన్స్‌ ఆర్థిక హోదా బలహీనపడిరదని చెప్పారు. సబ్‌ ఆప్టిమల్‌ లీజ్‌, ఎంఆర్‌ఓ, మ్యానుఫ్యాక్చరింగ్‌, అంతర్జాతీయ మార్గాల్లో రాకపోకలు తగ్గడం, నైపుణ్యమున్న సిబ్బంది కొరత వంటి ప్రధాన సవాళ్లు వైమానిక రంగం ఎదుట ఉన్నాయన్నారు. దిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరులోని పీపీపీ విమానాశ్రయాలు రూ.30వేల కోట్లు విలువ చేసే భారీ విస్తరణ ప్రాజెక్టులను చేపట్టాయి. 2025 నాటికి వీటిని పూర్తి చేయాలి. దేశవ్యాప్తంగా నూతన గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల అభివృద్ధి కోసం అదనంగా రూ.36వేల కోట్లను పీపీపీ మాధ్యమంగా పెట్టుబడిగా పెట్టాలని భావిస్తున్నట్లు సింగ్‌ తెలిపారు. 21 గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతానికి ఐదు ఎయిర్‌పోర్టులు కాలికట్‌, మంగళూరు, సిమ్లా, లెంగ్‌పూరి, పాక్యాంగ్‌లో టేబుల్‌ టాప్‌ రన్‌వేలు ఉన్నాయి. 140 విమానాశ్రయాలు, హెలిపోర్టులు, వాటర్‌ ఎయిరోడ్రోమ్‌లు ఉన్నాయి. ఏఏఐకి చెందిన 24 విమానాశ్రయాలు పనిచేయడం లేదు. సిమ్లా విమానాశ్రయంలో బేసిక్‌ స్ట్రీప్‌ పునరుద్ధరణ కోసం రూ.101.75 కోట్లను వెచ్చించాలని ఎయిర్‌పోర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) / విమానాశ్రయ ఆపరేటర్లు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్యాక్యాంగ్‌ విమానాశ్రయం అభివృద్ధి కోసం రూ.180.61 కోట్లు, మంగళూరు విమానాశ్రయంలో టర్మినల్‌ భవనం, ప్యారలల్‌ ట్యాక్సీ ట్రాక్‌, బేసిక్‌ స్ట్రిప్‌ గ్రేడిరగ్‌ కోసం రూ.567 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడిరచారు. మరో ఐదారు ఏళ్లకుపైగా ఏటా వెయ్యికిపైగా కమర్షియల్‌ పైలట్ల అవసరం భారత్‌కు ఉంటుందని సింగ్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img