Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

రజనీకాంత్‌ను వరించిన దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం
భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢల్లీిలో ఎంతో ఘనంగా జరిగింది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారతీయ సినీ రంగంలో ఉత్తమ నటన కనబరిచిన నటీనటులతోపాటు.. ఉత్తమ చిత్రాలగు అవార్డులు అందచేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా మలయాళం నుంచి ‘మరక్కర్‌’ నిలవగా, ‘భోంస్లే’ చిత్రానికి మనోజ్‌ బాజ్‌పాయీ’, ‘అసురన్‌’ చిత్రానికి ధనుష్‌ ఉత్తమ నటులుగా అవార్డులను సొంతంచేసుకున్నారు. తెలుగులో జెర్సీకి రెండు, మహర్షికి మూడు అవార్డులు. ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ. ఉత్తమ పాపులర్‌ చిత్రంగా మహర్షికి అవార్డులు లభించాయి.
ఇక అగ్రకథానాయకుడు, సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అత్యంత విశిష్టమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. గత నాలుగు దశాబ్ధాలకు పైగా సినీ రంగంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ఇప్పటికీ యంగ్‌ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తలైవా. సినీ కళామతల్లికి రజినీ అందిస్తున్న విశేష సేవలకుగానూ కేంద్రం అత్యున్నత దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా.. రజినీ తనకు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img