Friday, April 26, 2024
Friday, April 26, 2024

చంద్రబాబుకి అమిత్‌ షా ఫోన్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబుకి బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. రెండు రోజుల క్రితం దిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుసుకున్న చంద్రబాబు…అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించారు. ఆ సమయానికి అమిత్‌ షా జమ్మూకశ్మీర్‌ నుంచి రాకపోవడం, తర్వాత ముందుగా నిర్ణయించిన కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ మీటింగ్‌ ఉండడంతో కలవడం కుదరలేదని ఆయన పేషీ అధికారులు చంద్రబాబు బృందానికి సమాచారం అందించారు. దీంతో చంద్రబాబు బృందం దిల్లీ నుంచి వెనక్కి తిరిగొచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు అమిత్‌ షా ఫోన్‌ చేసి తనను ఎందుకు కలవాలని అనుకుంటున్నారోనని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఏపీ పరిస్థితులపై 8 పేజీలతో వినతిపత్రం తయారు చేశామని, అది పంపుతున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగ విధ్వంసం జరుగుతోందని, టీడీపీ కార్యాలయంపై, నేతలపై దాడులు, అక్రమ కేసులు తదితర విషయాలను అమిత్‌షాకు క్లుప్తంగా వివరించినట్లు తెల్సింది. ఏపీలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా జోరుగా సాగుతోందని ఆయనకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, ఆర్టికల్‌ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు వివరించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలతో, వీడియోతో సహా పంపుతానని తెలియజేస్తూ, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు తెల్సింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img