Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చట్టసభల్లో చర్చలేవీ..?

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి :
కరోనా కట్టడి కోసం విధించిన రాత్రి కర్ఫ్యూను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కొనసాగుతున్న కర్ఫ్యూను ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 69,088 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,535 మందికి కరోనా సోకినట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా నుంచి 2,075 మంది బాధితులు కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img