Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘చలో సెక్రటేరియట్‌’ ఉద్రిక్తం

  • సీపీఐ నేతలు, వందలాది మంది కార్యకర్తలు అరెస్టు
  • విజయవాడలో ఉద్రిక్తత
    విశాలాంధ్ర-విజయవాడ : అధిక ధరలను అరికట్టాలని, ప్రజలపై చార్జీలు, పన్నుల భారాలను తగ్గించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చేపట్టిన చలో అమరావతి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. విజయవాడలో సీపీఐ నాయకులతోపాటు వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వన్‌ స్టేషనుకు తరలించారు. పోలీసుల నిర్బంధాలను తప్పించుకుని నాయకులు ఆదివారమే దాసరి భవన్‌ వద్దకు చేరుకున్నారు. సోమవారం ఉదయం పది గంటలకు అమరావతి వద్దకు వందలాదిగా ర్యాలీగా బయకుదేరగా పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేసి వాహనాల్లో ఈడ్చిపడేశారు. దీంతో పోలీసులు, సీపీఐ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో దాసరి భవన్‌ సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అరెస్టు చేసినవారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ, కృష్ణాజిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, కర్నూలు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవానీ, డీహెచ్‌ పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుట్టి రామప్ప, ఏఐటీయూసీ డెప్యూటీ జనరల్‌ సెక్రటరీ ఎస్‌ వెంకట సుబ్బయ్య, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌ బాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్సన్‌ బాబు, రంగన్న, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, జనసేవాదళ్‌ ఇన్‌ స్ట్రక్టర్లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img