Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

చాపకింద నీరులా మంకీపాక్స్‌ విస్తరణ.. 7కు చేరిన పాజిటివ్‌ కేసులు


కేరళలో మంకీపాక్స్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో కొత్త మంకీపాక్స్‌ కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరింది. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్‌ లక్షణాలు ఉండటంతో పరీక్షించారు. దీంతో అతనికి మంకీపాక్స్‌ పాజిటివ్‌ అని తేలింది. కాగా, కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఒక భారతీయుడు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నాడు… రాష్ట్రంలో ఐదో మంకీపాక్స్‌ కేసు నమోదైందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ధృవీకరించారు. 30 ఏళ్ల బాధితుడు ప్రస్తుతం మలప్పురంలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్రంలో నమోదైన ఐదో కేసు అని తెలిపారు. బాధితుడు కుటుంబసభ్యులతోపాటు మరో 10 మందిని కాంటాక్ట్‌ అయ్యాడని చెప్పారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎడ్యుకేషన్‌ అండ్‌ హెల్త్‌ స్టాండిరగ్‌ కమిటీ సభ్యులు రెంజినీ తెలిపారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఏడు కేసుల్లో ఐదు మంకీపాక్స్‌ కేసులు కూడా కేరళ నుంచే ఉన్నాయి. మరో రెండు కేసులు ఢల్లీిలో నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే వ్యాపించే ఈ మంకీపాక్స్‌ వైరస్‌.. ఇప్పుడు అమెరికా, యూరోప్‌ దేశాల్లోనూ హడలెత్తిస్తోంది. ఇప్పటికే మంకీపాక్స్‌ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) దేశాలను అలర్ట్‌ చేసింది. పలు దేశాలు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img