Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చాప కింద నీరు విస్తరిస్తున్న ఒమిక్రాన్‌..దిల్లీలో రెండో కేసు

దేశంలో మొత్తం 33కు చేరిన కేసుల సంఖ్య
కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌లో క్రమంగా విస్తరిస్తోంది. దేశ రాజధాని నగరమైన దిల్లీలో ఒమైక్రాన్‌ వేరియెంట్‌ రెండో కేసు నమోదైంది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 33కు చేరింది. ఈ వారం జింబాబ్వే నుంచి ఢల్లీికి వచ్చిన ప్రయాణికుడి నుంచి తీసుకున్న నమూనాను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయించగా ఒమైక్రాన్‌ వేరియంట్‌ వెలుగుచూసింది. సదరు వ్యక్తి ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం అతను దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. ప్రస్తుతం అతన్ని దేశ రాజధానిలోని లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ హాస్పిటల్‌లో చేర్చారు. ఢల్లీి ఆసుపత్రిలో ఒమైక్రాన్‌ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చేరిన 27 మంది విదేశీ ప్రయాణికుల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను ఇప్పటివరకు నిర్వహించామని, అందులో 25 నమూనాలు నెగెటివ్‌గా ఉన్నాయని, ఇద్దరు వ్యక్తుల నమూనాల్లో ఒమైక్రాన్‌ వేరియెంట్‌ ను కనుగొన్నామని వైద్యాధికారులు చెప్పారు.దీంతో దేశంలో మొత్తం ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య 33కి పెరిగింది. శుక్రవారం నాటికి దేశంలో 32 ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి, మహారాష్ట్రలో శుక్రవారం 7 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img