Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చిందిన రైతు రక్తం

విచక్షణారహితంగా లాఠీఛార్జ్‌
10 మందికి పైగా అన్నదాతలకు తీవ్ర గాయాలు
వందలాది మంది అరెస్టు
పోలీసుల దుశ్చర్యను ఖండిరచిన రాజకీయ పార్టీలు
నిరసనగా రహదారుల దిగ్బంధం

చండీగడ్‌ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని నిర్లజ్జగా కొనసాగిస్తోంది. ప్రశ్నించే వారి గొంతుకలను నొక్కేయాలని, పోలీసు బలగాలతో అణచివేయాలని ప్రయత్ని స్తోంది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించే వారిపై కేంద్రం దమనకాండకు పాల్పడు తోంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన రైతు నిరసన కారులపై తీవ్ర దుశ్చర్యకు ఒడిగట్టింది. సాగు చట్టాలను నిరసిస్తున్న రైతులు హరి యాణాలో బీజేపీ`జేజేపీ ప్రభుత్వ బహిరంగ కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) ఇచ్చిన పిలుపు మేరకు కర్నాల్‌ సమీపంలోని బస్తారా టోల్‌ప్లాజా వద్ద వందలాది మంది రైతులు శనివారం నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు కర్నాల్‌ వైపుగా వెళుతున్న రైతులపై పోలీసులు ఒక్కసారిగా లాఠీలతో విరుచుకుపడ్డారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని ఆరోపిస్తూ రక్తమోడేలా చావబాదారు. ఈ ఘటనలో 10 మందికి పైగా అన్నదాతలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడి సమావేశానికి హరియాణా ముఖ్య మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఓం ప్రకాష్‌ ధంకర్‌, పార్టీ ఇతర సీనియర్‌ నాయకులు హాజరయ్యారు. కాగా రైతులపై పోలీసుల లాఠీఛార్జ్‌ ఘటనను అనేక రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిరచాయి. అంతకుముందు, సాయంత్రం 5 గంటల వరకు హరియాణాలోని జాతీయ రహదారులను రైతు నిరసనకారులు దిగ్బంధించాలని ఎస్‌కేఎం పిలుపు ఇచ్చింది. దీంతో భారీ పోలీసు బలగాల మోహరింపు నడుమ బస్తారా

టోల్‌ప్లాజా సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. ఈ సందర్భంగా పోలీసులు, రైతులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఒక్కసారిగా లాఠీలతో రైతులను చావబాదడం మొదలుపెట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన రైతులు రక్తంతో తడిచిన దుస్తులతో అక్కడే కూలబడిపోయారు. కొంతమంది పొల్లాలోకి పరుగులు పెట్టగా, వారిని సైతం వెంబడిరచి లాఠీలతో కొట్టారు. కాగా రైతుల నిరసనల నేపథ్యంలో కర్నాల్‌, పానిపటల్‌, అంబాలాలోని టోల్‌ప్లాజాలను మూసివేశారు. బస్తారాలోని టోల్‌ప్లాజాను పోలీసులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే అన్నదాతలు దాదాపు గంటకు పైగా ఎన్‌హెచ్‌44పై పానిపట్‌ వద్ద రహదారిని దిగ్బంధించారు. పోలీసుల దమనకాండపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలపై పోలీసుల చర్యకు నిరసనగా హరియాణా వ్యాప్తంగా అనేక రహదారులను రైతులు దిగ్బంధించారు. దీంతో దిల్లీఅమృత్‌సర్‌ జాతీయ రహదారిపై ఉన్న కురుక్షేత్రలోని రోడ్లపై నిరసనల ప్రభావంతో అంబాలాకు వెళ్లే శంభూ టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిరది. అన్ని రహదారులపై పెద్ద సంఖ్యలో రైతులు కటియాలు లేదా వెదురు మంచంపై కూర్చోవడం, అలాగే రోడ్డుపై బైఠాయించడం, నిలబడటం వంటి దృశ్యాలు కనిపించాయి.
మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిరచారు. బీజేపీ సమావేశ వేదికకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని, బాధ్యులయిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హరియాణా భారతీయ కిసాన్‌ యూనియన్‌(చాదుని) అధ్యక్షుడు గుర్నామ్‌ సింగ్‌ చాదుని పోలీసుల దమనకాండను ఖండిరచారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అనేక రైతు సంఘాలకు గొడుగు సంస్థగా ఉన్న సంయుక్త కిసాన్‌ మోర్చా పోలీసులు ‘దుశ్చర్య’ను ఖండిరచింది. ఎస్‌కేఎం నాయకుడు దర్శన్‌ పాల్‌ మాట్లాడుతూ ‘నిరసన ప్రశాం తంగా జరుగుతున్నప్పటికీ, పోలీసులు రైతులపై క్రూరంగా లాఠీఛార్జ్‌ జరిపారు. వందలాది మంది రైతులను అరెస్టు చేశారు. వాటిని వెంటనే విడుదల చేయాలి’ అని తన ఫేస్‌బుక్‌ వీడియో పోస్టులో డిమాండ్‌ చేశారు.
రైతులపై కమీషన్‌ ఏజెంట్‌ దౌర్జన్యం
సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లో రైతులపై కమీషన్‌ ఏజెంట్‌ ఒకరు దౌర్జన్యానికి దిగాడు. యాపిల్‌ ధరలు పతనమవడాన్ని నిరసిస్తూ రైతులు సోలన్‌ జిల్లాలో రహదారిని దిగ్బంధించి శనివారం నిరసన చేపట్టారు. అయితే మద్యం మత్తులో ఒక అరహతియా(కమీషన్‌ ఏజెంట్‌) రైతుల నిరసనకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమీషన్‌ ఏజెంట్‌కు, భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నాయకుడు రాకేష్‌ తికైత్‌ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో క్లిప్‌ ఒకటి వైరల్‌ అయ్యింది. కాగా ఈ వాగ్వాదం పెరగడానికి ముందు అక్కడ ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తర్వాత కమీషన్‌ ఏజెంట్‌ మీడియాతో మాట్లాడుతూ రైతులు రహదారిని దిగ్బంధించడం కారణంగా తన పనికి ఆటంకం కలిగిందని, వారు ఆందోళన చేయదల్చుకుంటే, ఏదైనా పొలంలో చేయవచ్చని అన్నాడు. దీనిపై సిమ్లాలో తికైత్‌ విలేకరులతో మాట్లాడుతూ ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని, చేతిలో రాళ్లు పట్టుకుని తమ వాహనాలను ధ్వంసం చేస్తానని బెదిరించాడని తెలిపారు. సోలన్‌ పోలీసు సూపరింటెండెంట్‌ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ ఎటువంటి ఫిర్యాదు అందనందున, పోలీసులు ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
ఇదిలాఉండగా గత తొమ్మిది నెలలకు పైగా దిల్లీ సరిహద్దు చుట్టూ వేలాది మంది రైతులు ఆందోళనను కొనసాగిస్తుండటంతో జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపై నిరసనలు, దిగ్బంధనాలు చోటుచేసుకుంటున్నాయి. జూన్‌లో కూడా హరియాణాలో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఒక ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత తోహానా పట్టణంలో రైతులు నిరసనకు దిగిన సమయంలో ఈ గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహం చెందిన రైతులు ఎమ్మెల్యే వాహనాన్ని చుట్టుముట్టడంతో పోలీసులు అనేక మంది రైతులను అరెస్టు చేసి, కేసులను నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img