Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

చైతన్య ఫీజుల మాఫియాపై ఎస్‌ఎఫ్‌ నిరసన`నేతల అరెస్టు

ఇష్టానుసారంగా దోపిడీ: జాన్సన్‌బాబు, శివారెడ్డి

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలో ఫీజుల మాఫియాకు తెరలేపి, టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్‌ పేర్లతో విద్యార్థులను, తల్లిదండ్రులను మోసగిస్తున్న శ్రీచైతన్య పాఠశాలలను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ, విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీచైతన్య స్కూల్‌ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) నేతలను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకత్వాన్ని అక్రమంగా అరెస్టు చేసి, విజయవాడలోని భవానీపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నిరసనకు ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.జాన్సన్‌బాబు, శివారెడ్డి నాయకత్వం వహించగా, రాష్ట్ర నాయకులు శ్రీరాములు ఫణీంద్ర, ఓబులేశ్‌, అప్పలస్వామి, మస్తాన్‌ వలరాజు కుళాయి స్వామి రాజేంద్ర చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నాగరాజు, శశికుమార్‌, ఉదయ్‌రవి, సోమన్న, సుబ్బరాయుడు, సాయి కుమార్‌ పవన్‌ తదితరులు పాల్గొన్నారు. జాన్సన్‌బాబు, శివారెడ్డి మాట్లాడుతూ చైతన్య, నారాయణ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని విమర్శించారు. కనీస నిబంధనలను పాటించకుండా, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బ్రాంచీలను నడుపుతున్నాయన్నారు. ప్రభుత్వ పరంగా పక్కాగా జీవోలు ఉన్నప్పటికీ, పాఠశాల/ కళాశాలలో పుస్తకాలు, దుస్తులు ఎలాంటి మెటీరియల్‌ అమ్మరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడం లేదన్నారు. ఒకటి నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకు దొంగ ర్యాంకులు వేసుకుని, పుస్తకాల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. భవన సముదాయాల్లో ఇరుకైన ప్రదేశాల్లో పాఠశాలలను నడుపుతున్నారని విమర్శించారు. విద్యాహక్కు చట్టం నిబంధనలను అమలు చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 30శాతం రాయితీ కల్పించకుండా మోసం చేస్తారా? అని నిలదీశారు. అక్రమ అరెస్టులను ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.రాజేంద్ర, నక్కా లెనిన్‌ బాబు తీవ్రంగా ఖండిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img