Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జనం సొమ్ము జగన్‌ పాలు

తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్‌ పయనంపై విమర్శలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: శాసనమండలి నిర్వహణ వల్ల ప్రజాధనం దుర్వినియోగమని చెప్పుకొచ్చిన పాలక పెద్దలు... 30 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి కూడా హెలికాప్టర్‌ ఉపయోగించడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉంటే కూతవేటు దూరానికి కూడా ఆకాశ ప్రయాణం తప్ప రోడ్డుపై వెళ్లరా అని ప్రశ్నిస్తున్నారు. మూడో విడత వైఎస్సార్‌ భరోసాపీఎం కిసాన్‌ నిధుల జమ, పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ డబ్బును మంగళవారం సీఎం జగన్‌ తెనాలిలో మీటనొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్‌లో వెళ్లారు. కేవలం 28 కిలోమీటర్ల దూరం ఉన్న తెనాలికి కారులోనే త్వరగా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం ప్రయాణించే రోడ్డు మార్గంలో పోలీసులు సహజంగానే ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. దీంతో కేవలం 20 నిముషాల్లోపు చేరుకునే గమ్యానికి హెలికాప్టర్‌ను ఉపయోగించడం, దానికోసం తెనాలిలో హెలిప్యాడ్‌ ఏర్పాట్లు చేయడం, అక్కడ నుంచి సభాస్థలికి చేరుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు వంటివన్నీ ఖర్చుతో కూడిన పనులే. ప్రజాధనం దుర్వినియోగం, అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి తప్ప హెలికాప్టర్‌ వినియోగించాల్సిన అవసరం ఏముందని జనసేన నేత, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. జనం సొమ్ము జగన్‌ హెలికాప్టర్‌ పర్యటనల పాలవుతోంది. హెలికాప్టర్‌ డబ్బులతో రోడ్లు బాగవుతాయి.
గుంతలతో రోడ్డు అధ్వానంగా ఉండడం వల్లే హెలికాప్టర్లో వెళ్తున్నారా? ప్రజలను మాత్రం గతుకుల రోడ్లపాలు చేసి మీరు మాత్రం హాయిగా హెలికాప్టర్లో తిరుగుతారా అని ఆయన ప్రశ్నించారు. పట్టుమని పావుగంట పట్టని ప్రయాణానికి హెలికాప్టర్‌ వినియోగించి ప్రజాధనం దుర్వినియోగం చేయడాన్ని టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img