Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జనవరికల్లా విలేజ్‌ క్లినిక్‌లు

ఫ్యామిలి కాన్సెప్ట్‌ కూడా సిద్ధం
వైద్యానికి పొరుగురాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి రాకూడదు
కొత్త మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు వేగవంతం
వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : జనవరి 26 నాటికి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తోపాటు, విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మా ణాలు వేగవంతం చేసి అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సంద ర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు ఆధునిక వైద్యంకోసం వెళ్లాల్సిన అవసరం రాకుండా వైద్య సౌకర్యాలను మెరుగుపర్చుకోవాలన్నారు. మన రాష్ట్రంలోనే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించే విధంగా ఉండాలన్నారు. ప్రస్తు తం రాష్ట్ర ప్రజలు ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో ఆయా ఆస్పత్రుల నిర్మాణం మనమే చేపట్టాలన్నారు. ఇందుకోసం మనకు కావాల్సిన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మా ణంపై అధికారులు దృష్టి పెట్టాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 కొత్త మెడికల్‌ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండిరగ్‌లో ఉంటే ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ఉన్న పీహెచ్‌ సీల్లో నాడు- నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు వంటి అంశాల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలని, వీరిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్యశ్రీపై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెల్త్‌కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండా లని, పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కరోనా పరిస్థితులను సీఎం ఆరా తీయగా, రికవరీ రేటు 98.86 శాతంగా ఉందని, జీరో కేసులు నమోదైన సచివాలయాలు 11,997 ఉన్నాయని అధికారులు వివరించారు. థర్డ్‌ వేవ్‌కు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నా మని, ఇప్పటివరకు 2,83,27,473 మంది వాక్సినేషన్‌ వేయించుకున్నారని తెలిపారు. ఇది మరింత వేగవంతం చేయాలని, కరోనా నివారణకు ఇదొక్కటే మార్గమని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీఎస్‌ నవీన్‌ కుమార్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్‌, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్‌, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్‌ హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img