Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జనవరి31న కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు.. తొలిసారి ప్రసంగించనున్న ద్రౌపది ముర్ము

జనవరి 31న పార్లమెంట్‌లో కేంద్రబడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా బడ్జెట్‌ సమావేశాల మధ్యలో తాత్కాలిక విరామం తర్వాత ఏప్రిల్‌ 6వ తేదీన ముగియనున్నాయి. 66 రోజుల కాలంలో 27 సిట్టింగ్‌లు ఉంటాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఈ రోజు వెల్లడిరచారు. గతేడాది ఆగస్టులో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము తొలిసారి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగం చేస్తారు. ఈ అమృత కాలంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్‌, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఈ రోజు ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img