Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

జయహో.. నీరజ్‌

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి పసిడి పతకం
జావెలిన్‌ త్రోలో స్వర్ణం గెలిచిన నీరజ్‌ చోప్రా

భారత యువ ఆటగాడు నీరజ్‌ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో ఇండియాకు గోల్డ్‌ మెడల్‌ అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా అద్భుతం చేశాడు. జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకాన్ని గెలిచాడు.జావెలిన్‌ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. ఏకంగా వందేళ్ల కలను నిజం చేశాడు. భారత్‌లో..వ్యక్తిగత క్రీడల్లో అభినవ్‌ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు. ఫస్ట్‌ ప్రయత్నంలోనే 87.03 మీటర్లు జావెలిన్‌ని విసిరిన నీరజ్‌ చోప్రా.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 87.58మీ, మూడో ప్రయత్నంలో 76.93మీ విసిరాడు. నాలుగో ప్రయత్నంలోనూ 80మీ దగ్గరగా జావెలిన్‌ని నీరజ్‌ చోప్రా విసిరాడు. కానీ.. అది ఫాల్‌ అయ్యింది. రెండవ, మూడవ స్థానాల్లో చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్లు నిలిచారు. వద్‌లేచ్‌ జాకుబ్‌ 86.67 మీటర్లు, వెస్లీ వెటిస్లేవ్‌ ల85.44 మీటర్ల దూరం విసిరి సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ అందుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img