Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జాతీయవాదం పేరుతో మోసాన్ని దాచిపెట్టలేరు

అదానీ స్పందనపై హిండెన్‌బర్గ్‌

న్యూదిల్లీ: అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక భారతీయ స్టాక్‌ మార్కెట్లను కుదిపేస్తోంది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండిరచింది. భారత్‌ సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని అమెరికా సంస్థపై విమర్శలు గుప్పించింది. అదానీ స్పందనను హిండెన్‌బర్గ్‌ తోసిపుచ్చింది. జాతీయ వాదం పేరుతో మోసాన్ని దాచిపెట్టలేరని తీవ్ర వ్యాఖ్యలతో బదులిచ్చింది. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై అదానీ గ్రూప్‌ ఆదివారం 413 పేజీల్లో తన స్పందనను తెలియజేసింది. ‘ఇది ఏదో ఒక కంపెనీపై చేసిన దాడి కాదు. భారత్‌, భారత స్వతంత్రత, భారతీయ సంస్థలు, వృద్ధి గాథ, ఆశయాలపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి’ అని మండిపడిరది. అయితే అదానీ గ్రూప్‌ స్పందనకు హిండెన్‌బర్గ్‌ తాజాగా బదులిచ్చింది.
అదానీ షేర్లు ఢమాల్‌
హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రభావంతో గతవారం భారీ నష్టాలు చవిచూసిన అదానీ గ్రూప్‌ షేర్లు.. సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ప్రధానమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు లాభాలు దక్కించుకున్నప్పటికీ.. అధిక భాగం కంపెనీల షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేరు ధరలు భారీగా పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ధర 3.93 శాతం లాభంతో రూ.2,869.85 వద్ద ముగిసింది. నేటి ట్రేడిరగ్‌లో ఈ షేరు ధర ఒక దశలో 10 శాతం వరకు పెరిగింది. ట్రేడిరగ్‌ ఆరంభమైన కాసేపటికే అదానీ టోటల్‌ గ్యాస్‌ షేరు ధర 20శాతం పతనమై లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. నేటి ట్రేడిరగ్‌లో ఈ కంపెనీ షేరు విలువ రూ.585.60 తగ్గి రూ.2,342.40 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేరు ధర కూడా ఒక దశలో 20 శాతం తగ్గింది. ఆ తర్వాత కాస్త కోలుకుని మార్కెట్‌ ముగిసే సమయానికి 15.23శాతం నష్టంతో రూ.1707.35 వద్ద స్థిరపడిరది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేరు విలువ 20శాతం పతనమైంది. నేటి ట్రేడిరగ్‌లో ఈ షేరు ధర రూ.297.25శాతం తగ్గి రూ.1,189.00 వద్ద ముగిసింది. అదానీ పవర్‌ లిమిటెడ్‌ షేరు ధర 5 శాతం కుంగి రూ.235.55గా ముగిసింది. అదానీ విల్మర్‌ షేరు ధర కూడా 5 శాతం తగ్గి రూ.491 వద్ద స్థిరపడిరది. అదానీ పోర్ట్స్‌ షేరు ధర 0.64 శాతం స్వల్ప లాభంతో రూ.600.80 వద్ద ముగిసింది. ఈ షేరు కూడా ఒక దశలో 10 శాతానికి పైగా లాభంతో ట్రేడ్‌ అయింది. ఇక, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ షేర్లు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని…ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన సంచలన నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో స్టాక్‌మార్కెట్లలో ఈ షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img