Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జీఎస్టీ పరిహారం కొనసాగింపు కోసం అనేక రాష్ట్రాలనుంచి అభ్యర్థనలు

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
న్యూదిల్లీ: జీఎస్టీ కింద పరిహారం చెల్లించే విధానాన్ని జూన్‌ 2022 తర్వాత కూడా పొడిగించాలని చాలా రాష్ట్రాలు అభ్యర్థించాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం తెలిపారు. లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో సీతారామన్‌ ఈ సంగతి వెల్లడిరచారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం రాష్ట్రాలు/యూటీలకు 5 సంవత్సరాల పాటు జీఎస్‌టీ పరిహారం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరో ఐదేళ్లపాటు నష్టపరిహారం చెల్లింపు విధానాన్ని పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయా అనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ… ాఅవును సర్‌. అనేక రాష్ట్రాలు చర్చల సమయంలో పరిహారం వ్యవధిని పొడిగించాలని అభ్యర్థించాయి. ఈ మేరకు జీఎస్‌టీ మండలి, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపారు్ణ అని తెలిపారు. 2017-18, 2018-19 మరియు 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జీఎస్‌టీ పరిహారం ఇప్పటికే రాష్ట్రాలకు చెల్లించినట్లు ఆమె పేర్కొన్నారు. పరిహార నిధి వసూళ్లు అవసరానికి తగినంతగా లేకపోవడంతో 2020-21, 2021-22 సంవత్సరాలకు, కేంద్రం వరుసగా రూ. 1.10 లక్షల కోట్లు, రూ. 1.59 లక్షల కోట్ల నిధులను అప్పుగా తీసుకుని, వాటిని రాష్ట్రాలకు పంపిందని మంత్రి వెల్లడిరచారు. రాష్ట్రాలకు జీఎస్‌టీ ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి 2020-21 మరియు 2021-22లో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి లగ్జరీ, డీమెరిట్‌ వస్తువులపై విధించిన పరిహారం సెస్‌ మార్చి 2026 వరకు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టం ప్రకారం, జూలై 1, 2017 నుండి జీఎస్‌టీ అమలులోకి వచ్చిన మొదటి ఐదు సంవత్సరాలలో ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలకు ద్వైమాసిక పరిహారం చెల్లించబడుతుందని హామీ ఇవ్వబడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img