Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జీఓ నం.1 అమలు మరింత కఠినం

. రోడ్లపై సభలకు చెక్‌ పెడదాం
. సోషల్‌ మీడియా వేధింపులపైనా కఠిన చర్యలు
. పోలీస్‌ అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ప్రజలంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జీవో1 అమలుపై మొండిగానే వ్యవహరిస్తోంది. ఈ జీవోకు సంబంధించి హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉంది. దీనిని అవకాశంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జీవోను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షపార్టీలపై ఉక్కుపాదానికి సమాయత్తమవుతోంది. ఉద్యమాలు, సభలు, సమావేశాల అణచివేతకు యత్నిస్తోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. జీవో1ని కఠినంగా అమలు చేసేందుకు పోలీసులకు స్వేచ్ఛనిచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రానికి ఇదేం ఖర్మ పేరుతో ప్రజల్లోకి వెళుతుండగా, నారా లోకేశ్‌ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాసమస్యలపై వామపక్షాలు, కార్మిక సంఘాలు నిత్యం ఆందోళనలు చేపడుతున్నాయి. వీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం జీవో1ను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రే పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సభలకు భారీగా ప్రజలు హాజరైనట్లు చూపడానికి మాత్రమే విపక్షాలు రోడ్లపై కిక్కిరిసేలా చేస్తున్నారని, ఇప్పటికే రెండు సభల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఇక రోడ్లపై సభల వల్ల ప్రజలు చనిపోయే పరిస్థితి రాకూడదని పోలీస్‌ అధికారులకు సీఎం జగన్‌ స్పష్టంచేశారు. జీవో`1 పకడ్బందీగా అమలు చేయాల్సిందేనని ఆదేశించారు. మహిళలపై సైబర్‌ వేధింపుల గురించి సమీక్షించారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో రాజీపడొద్దని సూచించారు. దిశ ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచామని, సైబర్‌, సోషల్‌మీడియా ద్వారా మహిళలు, చిన్నారులపై

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img