Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జీవో 1పై త్వరగా తేల్చండి

హైకోర్టుకు సుప్రీం సూచన

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీలు ర్యాలీలు, ధర్నాలు జరపడాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1పై ఏపీ హైకోర్టు త్వరగా విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. జీవో నెంబర్‌ 1పై జనవరి 24న విచారణ ముగించిన ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును వాయిదా వేసింది. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. జీవో 1పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసి మూడు నెలలు దాటిందని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయపార్టీలపై తీవ్ర ఆంక్షలు పెడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకాలు కలిగిస్తోందని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇద్దరి వాదనలు విన్న సుప్రీంకోర్టు…దీనిపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img