Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్.. తాడిప‌త్రిలో టెన్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెన్నా నది నుండి అక్రమంగా ఇసుకను తరలింపును అధికారులు ఆదివారంలోపు అరికట్టాలని లేకుంటే నేనే స్వయాన వాహనాలను అడ్డుకొని తగలబెడతానంటూ జేసి ప్రభాకర్ రెడ్డి గత వారం రోజుల క్రితం హెచ్చరికలు చేశారు. ఈ తరుణంలో సోమవారం డి.ఎస్.పి చైతన్య, సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు, పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనకు నోటీసులు జారీ చేసి గుహనిర్బంధం చేశారు. ఎవరు కూడా అటువైపు వెళ్ళకుండా రహదారి పైన భారీ కేట్లు ఏర్పాటుచేసి రహదారిని దిగ్బంధం చేశారు. కార్యకర్తలను ఎక్కడివారిన అక్కడే అరెస్టు చేస్తూ పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త‌ వాతావరణం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img