Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జోక్‌ చేశా..

యూపీ సీఎం అభ్యర్థి నేనే అని హింట్‌ ఇచ్చి.. వెనక్కి తగ్గిన ప్రియాంక గాంధీ
తానే యూపీ సీఎం అభ్యర్థినంటూ హింట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ నేత ప్రియాక గాంధీ ఇప్పుడు వెనక్కి తగ్గారు. తానేదో ‘అనుకోకుండా జోక్‌ చేశా’నని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతిసారీ అదే ప్రశ్న అడుగుతుంటే ఏం చెప్పమంటారంటూ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్‌ తరపున నేను యూపీ సీఎం అభ్యర్థినని చెప్పలేను. మీరు పదే పదే అదే ప్రశ్న అడుగుతుండడంతో చిరాకుగా అనిపించింది. అందుకే అన్ని చోట్లా నేనే కనిపిస్తున్నానుగా’ అని ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని అడిగితే దానిపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.నిర్ణయం తీసుకుంటే అప్పుడు వెల్లడిస్తానని అన్నారు. కాబట్టి తానే యూపీ సీఎం అభ్యర్థినని అనుకోవడం సరికాదని చెప్పారు. తాను యూపీకి పార్టీ జనరల్‌ సెక్రటరీనని, కాబట్టి యూపీ బాధ్యత మొత్తం తనదేనని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img