Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

టిడ్కో ఇళ్ల కోసం 11న ప్రదర్శనలు

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దిల్లీ ధర్నాకు మద్దతు
చెత్త, ఆస్తి పన్ను పెంపుపై ఉద్యమాలు ఉధృతం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి :
వందలాది కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన టిడ్కో ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకుండా జాప్యం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 110 పట్టణాల్లో ఈనెల 11వ తేదీన ప్రదర్శనలు, సంబంధిత అధికారులకు వినతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం తోపాటు అన్ని జిల్లాల నగర, పట్టణ, కార్యదర్శులు, సహాయ కార్యదర్శుల సమావేశాన్ని ఆదివారం ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించారు. అనం తరం సమావేశం వివరాలను రామకృష్ణ మీడి యాకు వెల్లడిరచారు. టిడ్కో ఇళ్ల పంపిణీ జాప్యాన్ని ఎండగడుతూ గతంలో సీపీఐ ఉద్యమించిందని, ఫలితంగా త్వరలో బాధితులకు ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దానిని ఇంతవరకూ అమలు చేయడం లేదని రామకృష్ణ విమర్శిం చారు. ఇంటి స్థలాల పేరుతో టిడ్కో ఇళ్ల పంపిణీని జాప్యం చేస్తోందన్నారు. టిడ్కో ఇళ్ల పంపిణీపై మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. చెత్త, ఆస్తి పన్ను పెంచుతూ ప్రభుత్వం జారీజేసిన జీవోలను ఉపసంహరిం చాలని, ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, ఇందుకోసం రౌండుటేబుల్‌ సమావేశాలు, ఇంటింటా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం నిర్ణయిం చిందని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ జరిగే ఉద్యమాలకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. 2,3 తేదీల్లో పార్లమెంటు ఎదుట చేపట్టనున్న ధర్నాలో సీపీఐ ప్రత్యక్షంగా పాల్గొంటుందని పేర్కొన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాల అధ్వర్యంలో జరిగే ధర్నాకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి దిల్లీకి తరలివెళ్లిన వారికి సీపీఐ ప్రకటించిందన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించు కోవాలని సమావేశం డిమాండు చేసిందని వివరించారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈనెల 5న జరిగే ధర్నాకు సీపీఐ మద్దతిస్తోందన్నారు. పోలవరానికి తక్షణమే కేంద్రం నిధులు కేటాయించాలని, నిర్వాసితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించిందన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని, కాలయాపన చేయవద్దని డిమాండు చేసిందన్నారు. ఆన్‌లైన్‌ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, అక్కినేని వనజ, పార్టీ జిల్లా, నగర కార్యదర్శులు జంగాల అజయ్‌కుమార్‌, ఎ.రామానాయుడు, టి.జగదీష్‌, డేగా ప్రభాకర్‌, దోనేపూడి శంకర్‌, పైడి రాజు, పట్టణ, నగరాల కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img