Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టీకా డోసుల పంపిణీలో వీఐపీ సంస్కృతికి చోటివ్వలేదు : ప్రధాని మోదీ

అక్టోబర్‌ 21వ తేదీన దేశంలో కోవిడ్‌ టీకా పంపిణీ విషయంలో వంద కోట్ల మార్క్‌ను అందుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 130 కోట్ల మంది భారతీయులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తల కృషి తర్వాత ఈ మైలురాయిని సాధించామని మోదీ చెప్పారు. శుక్రవారం మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 100 కోట్ల టీకా మైలురాయిని సాధించినందుకు భారతీయులను మోదీ అభినందించారు. వంద కోట్ల వ్యాక్సిన్‌ డోసులు కేవలం సంఖ్య మాత్రమే కాదు అని, దేశ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం అన్నారు. కఠిన పరిస్థితుల్లో భారత్‌ ఓ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నట్లు చెప్పారు.. దేశంలో జరిగిన వ్యాక్సినేషన్‌ విధానంపై గర్వంగా ఫీలవ్వాలని అన్నారు. వ్యాక్సిన్‌ డోసుల పంపిణీలో వీఐపీ సంస్కృతి చోటుచేసుకోలేదని అన్నారు. ప్రతి ఒక్కర్నీ సమంగా చూశామని అన్నారు. శాస్త్రీయ పద్ధతిలో.. శాస్త్రీయ ఆధారంగా వ్యాక్సినేషన్‌ జరిగనిట్లు ప్రధాని తెలిపారు. ‘‘ఈ రోజు చాలా మంది ప్రజలు భారతదేశ కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తున్నారు.భారతదేశం 100 కోట్ల కరోనా టీకా మార్కును దాటిన వేగం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించారు.కరోనా మహమ్మారి ప్రారంభంలో, భారతదేశం వంటి ప్రజాస్వామ్యంలో ఈ మహమ్మారిపై పోరాడటం చాలా కష్టమనే భయాలు వ్యక్తమయ్యాయి.ఇంత సంయమనం, అంత క్రమశిక్షణ ఇక్కడ ఎలా పని చేస్తాయనేది ఈ టీకా కార్యక్రమం ద్వారా భారతదేశ ప్రజలకు కూడా చెప్పాం’’అని మోదీ చెప్పారు. ‘‘దేశం ‘అందరికీ టీకా’ నగదు రహిత వ్యాక్సిన్‌ అనే ప్రచారాన్ని ప్రారంభించాం.వాక్సిన్‌ పంపిణీలో పేద-ధనిక, గ్రామం-నగరం, సుదూర అనే తేడా లేకుండా దేశంలో ఒకే ఒక మంత్రం ఉంది. టీకాల పంపిణీలో ఎలాంటి వివక్ష ఉండదు’’అని మోదీ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img