Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ ఉద్రిక్తం

రైతు సమస్యలను పరిష్కరించాలంటూ టీడీపీ శాసనసభాపక్షం నిర్వహించ తలపెట్టిన నిరసన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎడ్లబండ్లతో నిరసన ర్యాలీగా వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసుకోగా..తుళ్లూరు పోలీసులు అడ్డుకున్నారు. ఎడ్లబండల్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించి టైర్లలో గాలి తీసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని నిరసనకు దిగారు. అక్కడనున్న ఎడ్లబండ్లను తోసుకుంటూ రోడ్డుపైకి వచ్చారు. ఎడ్లకు బదులుగా ఎమ్మెల్యేలు కాడి తగిలించుకుని బండిని లాగారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలోని కోటరీ వల్లే రైతాంగానికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. వ్యవసాయ రంగం మూడేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img