Friday, April 19, 2024
Friday, April 19, 2024

ట్విటర్‌కు ఎలాన్‌ మస్క్‌ భారీ ఆఫర్‌


మొత్తం కొనేస్తానంటూ బేరాలు
ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌కు టెస్లా సీఈఓ, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. కంపెనీకి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, వాటిని తాను అన్‌లాక్‌ చేస్తానని అంటున్నారు. ట్విటర్‌ను తనకు అమ్మేందుకు ఓ బెస్ట్‌, ఫైనల్‌ డీల్‌ను ప్రతిపాదించారు. ట్విటర్‌ ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎలాన్‌ మస్క్‌ అన్నారు. జనవరి 28 ముగింపు ధరతో పోలిస్తే 54 శాతం ప్రీమియం చెల్లిస్తానని పేర్కొన్నారు. అప్పటికి ఆ షేరు ధరను విలువ కడితే 43 బిలియన్‌ డాలర్లు అవుతోంది. అప్పట్నుంచి ఈ సోషల్‌ మీడియా కంపెనీ షేరు 18 శాతం పెరిగింది. గురువారం ఎలాన్‌ మస్క్‌ ఈ ఆఫర్‌ను అమెరికా సెక్యూరిటీ, ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌ వద్ద దాఖలు చేశారు. ఇప్పటికే ఆ కంపెనీలో మస్క్‌కు 9 శాతం వాటా ఉంది. ఏప్రిల్‌ 4న తొలిసారి ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. మస్క్‌ ఆఫర్‌తో ఫ్రీ మార్కెట్‌ ట్రేడిరగ్‌లో ట్విటర్‌ షేర్లు 12 శాతం మేర దూసుకెళ్లాయి. ‘ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛగా మాట్లాడుకునే వారికి వేదికగా మారుతుందన్న ఉద్దేశంతో ట్విటర్‌లో ఇటీవల పెట్టుబడి పెట్టా. అయితే ప్రస్తుతమున్న తరహాలో పనిచేయడం వల్ల అది సాధ్యం కాదు. అందుకే ఓ ప్రైవేటు కంపెనీ తరహాలో ట్విటర్‌ పనిచేయాల్సిన అవసరం ఉంది. కొన్ని మార్పులు అవసరం. అని మస్క్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విటర్‌ ఛైర్మన్‌ బ్రెట్‌ టేలర్‌కు ఓ లేఖ రాశారు. ఇది బెస్ట్‌ ఆఫర్‌ అని, ఫైనల్‌ ఆఫర్‌ అని కూడా పేర్కొన్నారు. ఒకవేళ తన ఆఫర్‌ను ఆమోదించకపోతే వాటా విషయంలో పునరాలోచన చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. ట్విటర్లో ఎక్కువగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఆయనకు ఈ వేదికలో 80 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్లో చేయాల్సిన మార్పులపై ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు మాట్లాడారు. వాటా ఉందని తెలియడంతో కంపెనీ ఆయన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ పదవిని ఆఫర్‌ చేసింది. దాంతో ఆయన లార్జెస్ట్‌ ఇండివిజ్యువల్‌ షేర్‌ హోల్డర్‌గా మారారు. తన వాటా గురించి బయటకు తెలియగానే మస్క్‌ ఎన్నో ప్రతిపాదనలు చేశారు. మున్ముందు ఎలాంటి మార్పులు అవసరమో వెల్లడిరచారు. సాన్‌ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం, ట్వీట్లకు ఎడిట్‌ బటన్‌ ఇవ్వడం, ప్రీమియం యూజర్లకు ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్‌ మార్క్స్‌ ఇవ్వడం గురించి మాట్లాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img