Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ట్విటర్‌ను మళ్ళీ ఉపయోగించను : డొనాల్డ్‌ ట్రంప్‌

సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ చాలా బోరింగ్‌గా తయారైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ వేదికను టెస్లా సీఈఓ ఎలన్‌ మస్క్‌ వశం చేసుకున్నప్పటికీ, తాను మళ్ళీ ఆ వేదికపైకి రాబోనని చెప్పారు. తాను కేవలం తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్‌ సోషల్‌’ను మాత్రమే ఉపయోగిస్తానని తెలిపారు.డోనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను తిరిగి పునరుద్ధరించాలని రిపబ్లికన్లు కోరారు. ట్విట్టర్‌ ఎలన్‌ మస్క్‌ చేతిలోకి వెళ్లిన సందర్భంగా ఇదే సరైన తరుణమని, ఆయన ఖాతాను తిరిగి పునరుద్ధరించాలని ట్విట్టర్‌ వేదికగా రిపబ్లికన్లు కోరారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్లు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని, అందుకే శాశ్వతంగా ఆయన ట్విట్టర్‌ను మూసేస్తున్నట్లు ట్విట్టర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌ సామాజిక మాధ్యమాన్ని స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేశారు. కొన్ని రోజుల క్రితమే ఈయన ఈ సంస్థలో 9.2 శాతం వాటా కొనుగోలు చేశారు. ఇకపై మొత్తాన్నీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను తిరిగి పునరుద్ధరించాలని రిపబ్లికన్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయిత ట్విట్టర్‌ ఇప్పుడు ఎలాన్‌ మస్క్‌ చేతిలోకి వెళ్లిపోయినందున ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను తిరిగి పునరుద్ధరిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై ట్రంప్‌ స్వయంగా సమాధానమిచ్చారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో ట్రంప్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను ట్విటర్‌ను మళ్ళీ ఉపయోగించబోనని డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. తాను ట్రూత్‌ సోషల్‌లోనే తన అభిప్రాయాలను పంచుకుంటానని తెలిపారు. ఎలన్‌ మస్క్‌ చాలా మంచివారని, అందులో అనుమానం లేదని, అయితే తాను మాత్రం తిరిగి ట్విట్టర్‌ ఖాతాను తెరిచేది లేదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img