Friday, April 19, 2024
Friday, April 19, 2024

ట్విన్‌ టవర్స్‌ను కూల్చేయండి : సుప్రీం


ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో ఉన్న అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల బిల్డింగ్‌లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 40 అంతస్తులు ఉన్న రెండు టవర్స్‌లో మొత్తం 900 ప్లాట్స్‌ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ స్కై టవర్స్‌లో 630 ఫ్లాట్స్‌ను కస్టమర్స్‌ బుక్‌ చేసుకున్నారు. ఈ నిర్మాణం చేపట్టిన సూపర్‌ టెక్‌ కంపెనీ.. నిర్మాణ రంగ నిబంధనలు ఉల్ల్లంఘించింది. ముందు ఒక ప్లాన్‌తో వెళ్లిన నిర్మాణ కంపెనీ.. ఆ తర్వాత మార్చేసింది. అదే సమయంలో కస్టమర్లకు కంప్లీట్‌ ప్లాన్‌ ఇవ్వలేదు. రెండు టవర్ల మధ్య ఉండాల్సిన మినిమన్‌ గ్యాప్‌ మెయింటేన్‌ చేయలేదు.ఫైర్‌ సెప్టీ రూల్స్‌ పాటించలేదు. గ్రీనరీ పెంచలేదు. ఇలా అనేక ఉల్లంఘనలకు పాల్పడటంతో ఈ భారీ నిర్మాణాలను కూల్చివేయాలంటూ కోర్టు ఆదేశించింది. ఈ భారీ అంతస్తులను కూల్చివేయాలని ఆదేశించిన కోర్టు.. రెండు నెలల్లో కస్టమర్లకు డబ్బులు చెల్లించాలని సూచించింది.ఇంతపెద్ద బిల్డింగ్‌ నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారంటూ నోయిడా మున్సిపాలిటీకి కోర్టు అక్షింతలు వేసింది. రూల్స్‌ను అతిక్రమించి ఆ ట్విన్‌ టవర్స్‌ను నిర్మించినట్లు పేర్కొన్నది. అయితే స్వంత ఖర్చుతో మూడు నెలల్లోగా ఆ రెండు బిల్డింగ్‌లను సూపర్‌టెక్‌ కంపెనీయే నేలమట్టం చేయాలని ఇవాళ సుప్రీం తన తీర్పులో ఆదేశించింది. గతంలో ఈ కేసులో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img