Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌తో ఆ రిస్కు తక్కువే

తాజా అధ్యయనంలో వెల్లడి
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. భారత్‌లోనూ క్రమంగా ఉనికి చాటుతోంది. ఇప్పటికే 16 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్‌ విస్తరించింది. ఇప్పటివరకు ఒమిక్రాన్‌ తీవ్రతపై స్పష్టత లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌తో వ్యాధి తీవ్ర, ఆస్పత్రిపాలయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని తాజాగా మరో రెండు అధ్యయనాల్లో వెల్లడైంది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తిచెందినా ఈ వేరియంట్‌తో తీవ్ర అస్వస్ధతకు గురవడం, ఆస్పత్రిపాలయ్యే ముప్పు మూడిరట రెండు వంతులు తక్కువని యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ పరిశోధకులు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన వర్కింగ్‌ పేపర్‌లో పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ వల్ల ఆసుపత్రిపాలయ్యే ప్రమాదం 40శాతం నుంచి 50శాతంకు తక్కువగానే ఉందని అధ్యయనంలో వెల్లడైంది. ఒకసారి ఆస్పత్రిలో చేరితో తీవ్ర వ్యాధి బారినపడే ముప్పు మాత్రం రెండు వేరియంట్లలో ఒకే విధంగా ఉందని దక్షిణాఫ్రికాలో నిర్వహించిన మరో అధ్యయనపత్రం వెల్లడిరచింది. స్కాట్లాండ్‌ అధ్యయనం నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 19 వరకూ 1,26,511 డెల్టా కేసులు, 23,840 ఒమిక్రాన్‌ కేసులను పరిశీలించిన మీదట ఈ వివరాలు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img