Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

డెల్టా, ఒమిక్రాన్‌ కలయికతో కొత్త వేరియంట్‌..‘డెల్టాక్రాన్‌’

యూకేలో కేసులను గుర్తించిన శాస్త్రవేత్తలు
కరోనా వైరస్‌ మహమ్మారి రోజుకో కొత్త రూపంలో ప్రపంచంపై దాడిచేస్తోంది.ఇప్పటికే ఆల్ఫా, డెల్టా, బీటా, ఒమిక్రాన్‌ వంటి వేరియంట్లు విజృంభించి అతలాకుతలం చేశాయి. గతేడాది చివరిన దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్‌ ఒమిక్రాన్‌ మిగతా వాటికంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దీని తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ కేసుల రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. తాజాగా, మరో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్టు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. కరోనా రెండో విడతలో డెల్టా రూపంలోను, మూడో విడతలో ఒమిక్రాన్‌ రూపంలోను ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడడం తెలిసిందే. ఈ రెండు రకాలను పోలిన లక్షణాలు కనిపిస్తుండడంతో దీన్ని డెల్టాక్రాన్‌గా పిలుస్తున్నారు. వాస్తవానికి డెల్టాక్రాన్‌ను మొదటిసారిగా సైప్రస్‌లో గత డిసెంబర్‌లో గుర్తించారు. డెల్టా, ఒమిక్రాన్‌ లక్షణాలు డెల్టాక్రాన్‌ కేసుల్లో ఉన్నట్టు యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్‌ఎస్‌ఏ) ప్రకటించింది. ఈ కేసులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది. ప్రారంభంలో దీనిపై పరిశోధన జరిపినప్పుడు ల్యాబ్‌లో జరిగిన తప్పిందమని భావించారు. కానీ, డెల్టాక్రాన్‌ అనేది కొత్త కొవిడ్‌ స్ట్రెయిన్‌ అని.. అది ఒమిక్రాన్‌.. డెల్టా వేరియంట్ల హైబ్రిడ్‌ జాతికి చెందినదిగా నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ వేరియంట్‌కు సంబంధించి కేసులు యూకేలో నమోదయ్యాయి. అయితే ఈ కేసులు తక్కువగానే ఉండటంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. మొత్తం 25 డెల్టాక్రాన్‌ కేసులను తమ బృందం గుర్తించిందని సైప్రస్‌ యూనివర్సిటీ పరిశోధకుడు లియోనిడాస్‌ కోస్ట్రోకిస్‌ తెలిపారు. జనవరి 7న వీటిని జన్యు విశ్లేషణ కోసం జీఐఎస్‌ఏఐడీకి పంపామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img