Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై కొవాగ్జిన్‌ టీకా భేష్‌ : ఐసీఎంఆర్‌

భారత బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై సమర్థంగా పని చేస్తున్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దేశంలో కరోనా ఉధృతి, కొవిడ్‌ టీకాల పనితీరుపై ఐసీఎంఆర్‌ ఓ అధ్యయనం చేపట్టింది. కొవిడ్‌-19 డెల్టా వేరియంట్‌ ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్‌లో సెకండ్‌ వేవ్‌కు ఈ వేరియంట్‌ కారణమని తేలింది. ఈ వేరియంట్‌ నుంచి కొవాగ్జిన్‌ మెరుగైన రక్షణ కల్పిస్తోందని, దీంతోపాటు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను కూడా ఈ టీకా ప్రభావవంతంగా ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్‌ తెలిపింది. కొవాగ్జిన్‌ రోగ లక్షణాలున్న వ్యక్తుల్లో 77.8శాతం ప్రభావం చూపగా.. కొత్త డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 65.2శాతం రక్షణ కల్పించిందని భారత్‌ బయోటెక్‌ జూలైలో తెలిపింది.తీవ్రమైన కేసులకు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ 93.4శాతం సమర్థతను ప్రదర్శించిందని ఆ సంస్థ వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img