Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు


దేశవ్యాప్తంగా 31,443 కొత్త కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న 17,40,325 మందికి కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, 31,443 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09 ,05, 819 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కొవిడ్‌తో 2020మంది మరణించారు.దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,10,784 కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 49,007 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం రికవరీలు 3,00,63,730గా ఉందని అధికారులు తెలిపారు. కాగా మహారాష్ట్రలో జూలై మొదటి 11 రోజుల్లో 88,130 కోవిడ్‌ -19 కేసులు నమోదయ్యాయి.గత రెండు వేవ్‌ ల ఉధృతితో పోలిస్తే.. ఇప్పుడు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తోందని నిపుణుల అంచనా. మహారాష్ట్ర, ముంబై లో థర్డ్‌ వేవ్‌ రానున్నదని చెప్పడానికి సంకేతమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img