Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తెలుగురాష్ట్రాల్లో మరో నాలుగు రోజులపాటు భారీవర్షాలు

ఏపీ, తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. మరో నాలుగురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. 7, 8, 11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు ఉండనున్నట్లు అధికారులు అంచనా వేశారు.అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నిన్న దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీర ప్రాంతాలపై ఉన్న అల్ప పీడన ప్రాంతం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీర ప్రాంతాల్లోకి విస్తరించి దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకూ విస్తరించి ఎత్తుకు వెళ్లేకొలదీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత గుర్తించే అవకాశం ఉంది.రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్‌, కోటా, గుణ, దామోప్‌ా, పెండ్రా రోడ్‌, ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతం మీదుగా అల్ప పీడన ప్రాంత కేంద్రం గుండా వెళ్తూ, అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడతాయి. రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు పడే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో … గత నాలుగురోజులుగా ఎగువ రాష్ట్రాలతోపాటు తెలంగాణాలో కూడా కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తింది. గోదారమ్మ ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. గోదావరినది పరీవాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సూర్యాపేట, సిద్ధిపేట, నల్గండ ప్రాంతాల్లో రెడ్‌ అలెర్ట్‌ ను, హైదరాబాద్‌ కు ఎల్లో అలెర్ట్‌ ను వాతావరణ శాఖ జారీ చేసింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు ఒసామాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్‌ల నుండి అదనపు నీటిని విడుదల చేయడానికి వరదగేట్లను ఎత్తివేయవలసి వచ్చింది.
తెలంగాణలో మూడురోజులు స్కూళ్లకు సెలవు..
మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పలు యూనివర్సిటీలు కూడా పరీక్షలను వాయిదా వేశాయి. తెలంగాణలో భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరింది. హిమాయత్‌ సాగర్‌ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. హుస్సేన్‌ సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img